ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల మధ్య ఆ విషయమై విభేదాలు?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30 చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.రాధాకృష్ణ మరియు కళ్యాణ్‌ రామ్‌లు ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా కూడా చెప్పారు.

 Ntr, Trivikram, Rrr, Shooting , Ntr With Trivikram-TeluguStop.com

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని నిర్మాత చెప్పాడు.కాని ఇప్పుడు సినిమాకు సంబంధించిన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మూవీ ప్రారంభించాలనుకున్నారు.
కరోనా కారణంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఆరు నెలల ఆలస్యం అవుతుందట.

దాంతో త్రివిక్రమ్‌ అంత కాలం పాటు వెయిట్‌ చేయాలనుకోవడం లేడట.ఈ గ్యాప్‌లో మరో హీరోతో సినిమాను చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడట.

వచ్చే ఏడాది సమ్మర్‌లో ఎన్టీఆర్‌తో సినిమాను ప్రారంభించి అదే ఏడాది చివర్లో లేదా 2022 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ రీ షెడ్యూల్‌ చేశాడట.ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

Telugu Ntr Trivikram, Trivikram-

ఎన్టీఆర్‌ మాత్రం త్రివిక్రమ్‌ మధ్య లో చిన్న సినిమా చేయడంను ఒప్పుకోవడం లేదు.కాస్త ఆలస్యం అయినా కూడా తనతోనే సినిమా ఉండాలంటున్నాడట.ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.కావాలంటే ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ముగిసిన వెంటనే ఏమాత్రం బ్రేక్‌ తీసుకోకుండా డేట్లు ఇస్తానంటూ త్రివిక్రమ్‌కు చెప్పాడట.మరి వీరిద్దరి మద్య ఈ చిన్న విభేదాలు మరింతగా ముదురుతాయా లేక అవి ఇంతటితో ఆగుతాయి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube