గతేడాది కార్తీ హీరోగా తమిళ, తెలుగు భాషలలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఖైదీ.ఈ సినిమా కార్తీ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవడంతో పాటు తక్కువ బడ్జెట్ తో వచ్చి వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాని దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ తో మాస్టర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తూ ఉండటం మరో విశేషం.
ఇదిలా ఉంటే ఇంత పెద్ద హిట్ అయిన ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు అంత ఈజీగా వదులుకోరనే విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు దీనిని రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకుంది.ఇక అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.
అక్కడ కూడా మాతృకని దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇప్పటికే సౌత్ లో సూపర్ హిట్ అయిన కథలని బాలీవుడ్ దర్శక, నిర్మాతలతో పాటు, అక్కడి హీరోలు కూడా ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.
అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ఇక్కడ కంటే పెద్ద హిట్ అయ్యి సాహిద్ కపూర్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకుంది.ఈ నేపధ్యంలో ఆ హీరో మరోసారి సౌత్ సినిమా అయిన జెర్సీని రీమేక్ చేస్తున్నాడు.
ఇదే కోవలో ఇప్పుడు ఖైదీ సినిమా బాలీవుడ్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది.