నిర్భయ కేసులో నిందితులకు అమలు కావాల్సిన ఉరిశిక్ష పై శుక్రవారం ఢిల్లీ లోని పటియాలా కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.అయితే నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ పెండింగ్ లో ఉన్నందున వారికి శిక్షలు అమలు చేయకూడదు అంటూ దోషుల తరపు న్యాయవాది వాదనలు వినిపించడం తో ఈ మేరకు పటియాలా కోర్టు స్టే విధించింది.
అయితే ఇప్పుడు వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించినట్లు తెలుస్తుంది.తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలి అంటూ కోరుతూ రాష్ట్రపతికి వినయ్ శర్మ పెట్టుకున్న పిటీషన్ తిరస్కరణకు గురికావడం తో ఇక ఇప్పడు ఆ నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు కు అవకాశం కలుగుతుంది.
అయితే రాష్ట్రపతి పిటీషన్ ను తిరస్కరించిన తరువాత 14 రోజుల తరువాత వారికి తిరిగి ఉరిశిక్షలు అమలు చేసే అవకాశం ఉంటుంది.అయితే 14 రోజుల తరువాత వారి ఉరిశిక్షలను అమలు పరుస్తారా లేదంటే మిగిలిన ఇద్దరి పిటీషన్ లు కూడా పూర్తి అయిన తరువాత వారికి ఉరిశిక్షలు అమలు పరుస్తారా అన్న దానిపై క్లారిటీ లేదు.నెక్స్ట్ తేదీ ఏదన్న దానిపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.2012 డిసెంబర్ లో చోటుచేసుకున్న నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అత్యంత దారుణంగా నిర్భయ పై అత్యాచారం చేసి ఆమె మృతికి కారకులు అయిన ఈ మృగాలకు శిక్షలు పడాలని నిర్భయ తల్లి గత 7 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది.అయితే విచారణ జరిపిన పటియాలా కోర్టు వారికి జనవరి 22 న ఉరిశిక్షలు అమలు చేయాలి అంటూ తొలుత తీర్పు వెల్లడించింది.
అయితే దోషుల్లో ఒకరు రాష్ట్రపతికి మెర్సీ పిటీషన్ దాఖలు చేయడం అది తిరస్కరణకు గురికావడం తో జనవరి 16 న వారికి ఉరిశిక్షలను ఫిబ్రవరి 1 వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.అయితే ఇప్పడు తాజాగా వినయ్ శర్మ కూడా మెర్సీ పిటీషన్ దాఖలు చేయడం అది పెండింగ్ లో ఉండడం తో కోర్టు స్టే విధిస్తూ శుక్రవారం వెల్లడించింది.అయితే ఇప్పుడు వినయ్ శర్మ పిటీషన్ కూడా తిరస్కరణకు గురికావడం తో వారికి తిరిగి మరలా ఎప్పుడు ఉరిశిక్షలు విధిస్తారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.