కర్ణాటకలో ఏం జరుగబోతుంది?

కర్ణాటకలో మళ్లీ ప్రభుత్వం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కుమార స్వామిపై విశ్వాస పరీక్ష పెట్టిన బీజేపీ ఆయన ఓడిపోవడంతో ప్రభుత్వంను ఏర్పాటు చేసింది.

 Karnataka State-TeluguStop.com

కర్ణాటకలో ప్రస్తుతం యడ్యూరప్ప ప్రభుత్వం కొలువు దీరి ఉంది.అయితే కుమార స్వామికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన ఆయా పార్టీల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆ ఉప ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ప్రభుత్వం మనుగడపై ఆదారపడి ఉంది.

ఆ ఎన్నికల్లో మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు బీజేపీ దక్కించుకుంటే పర్వాలేదు.

లేదంటే మళ్లీ బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోవాల్సి వస్తుంది.అప్పుడు బీజేపీకి సరైన బలం లేక ప్రభుత్వం కూలిపోతుంది.

దాంతో మళ్లీ కాంగ్రెస్‌ మరియు జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం ఖాయం అంటూ కర్ణాటక రాజకీయ నాయకులు అంటున్నారు.దేవగౌడ ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రాబోతున్నాడు అంటూ ప్రకటించాడు.

ఈ నేపథ్యంలో ఏం జరుగబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఉప ఎన్నికల ఫలితాలు కర్ణాటక రాజకీయాన్ని ఏ విధంగా మలుపు తిప్పుతుందా అంటూ చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube