రాజధాని పర్యటన బాబు కి కలిసొస్తుందా ?

రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాడు.ప్రతిపక్షంలో ఉన్నా తాము ఎప్పుడూ ప్రజా సమస్యల విషయంలో ముందుంటామని సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

 Chandrababu Ap Capital Tour-TeluguStop.com

అదే సమయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని బాబు అధికార పార్టీపై సమర శంఖం పురిస్తున్నాడు.ఇప్పటికే ఇసుక పోరాటం ,భవన నిర్మాణ కార్మికులకు అండగా దీక్ష చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ప్రవేశపెట్టడంపై నిరసన, ఇలా క్షణం తీరిక లేకుండా ఒకదాని వెంట ఒక సమస్యను భుజానికెత్తుకుని పార్టీ బరువును బాబు మోస్తున్నాడు.

ఇది కాస్త శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుండడంతో పాటు బాబుకు పాజిటివ్ రిపోర్ట్స్ అందుతున్నాయి.అలాగే త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బాబు భావిస్తున్నాడు.

Telugu Apcm, Chandrababu, Chandrababu Ap, Chandrababuap, Chandrabausand, Tdp Cha

తాజాగా ఆయన ఈ రోజు అమరావతి పర్యటన అనేక వివాదాలకు కారణం అయ్యేలా కనిపిస్తోంది.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, బాబు చెప్పుకుంటున్నాడు.టిడిపి హయాంలో తాము నిర్మించిన భవనాలను ఈరోజు పరిశీలించి నిలిచిపోయిన నిర్మాణ పనులపై వైసీపీని ప్రశ్నించేందుకు చూస్తున్నారు.అయితే ఇక్కడ రాజధాని రైతులు రెండు వర్గాలుగా చీలిపోయారు.

అందులో ఒకటి వైసిపి అనుకూల వర్గం కాగా మరొకటి టిడిపి అనుకూల వర్గం.తాజాగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో చోటు కల్పించడంతో అదంతా తమ ఘనత అని చెప్పుకునేందుకు బాబు చూస్తున్నాడు.

రాజధానిపై అలుపెరగకుండా పోరాడి వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.

Telugu Apcm, Chandrababu, Chandrababu Ap, Chandrababuap, Chandrabausand, Tdp Cha

రాజధాని విషయంలో వైసిపి అధినేత సీఎం జగన్ ఎటువంటి స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదు.దీంతో రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.తమకు కేటాయించిన ప్లాట్లు అభివృద్ధి చేయకపోవడం, రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోవడంతో భూముల ధరలు భారీగా పడిపోయాయి.

టిడిపి హయాంలో ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదు.ఇవన్నీ తనకు అనుకూలంగా మార్చుకుని వైసీపీని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని హైలెట్ అయ్యేలా చేసి టిడిపి ప్రభుత్వం అప్పట్లో రాజధాని నిర్మాణానికి చేసిన కృషిని చెప్పుకోవాలి అని చూస్తున్నాడు.

అలాగే ఇటీవల రాజధాని మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిని స్మశానంతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపైన బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిని రాజధాని ప్రాంత రైతులోకి బలంగా తీసుకెళ్లి క్షమాపణ చెప్పాలనే డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube