వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తోన్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా మొదట్నుండీ వివాదాలను రేకెత్తిస్తూ వస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేస్తూ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఇందులో అనేక మంది రాష్ట్ర, దేశ రాజకీయ నాయకులను అనుకరించారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా కేఏ పాల్ పాత్రకు సంబంధించిన ఓ పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ పాటను రిలీజ్ చేస్తూ వర్మ మరో ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్‌లోకి సినిమాతో ఏమాత్రం సంబంధం లేని దర్శకధీరుడు రాజమౌళిని కూడా లాగాడు వర్మ.జోకర్ సినిమా కూడా దేశంలో సూపర్ హిట్ అయితే కేఏ పాల్ వంటి వ్యక్తికి సంబంధించిన బయోపిక్ బాహుబలి 3 కంటే కూడా సూపర్ డూపర్ హిట్ అవడం ఖాయమని, దీనికి సంబంధించిన సంప్రదింపులను దర్శకధీరుడు రాజమౌళి మొదలుపెట్టాడని వర్మ ట్వీట్ చేశాడు.
దీంతో రాజమౌళి తనదైన శైలిలో స్పందించాడు.
‘రాజుగారు ఈ విషయంలో నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయకండి’ అంటూ జక్కన్న స్పందించాడు.ప్రస్తుతం రాజమౌళి వర్మకు ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏదేమైనా వర్మ తలచుకుంటే దేనినైనా వైరల్ చేయగలడనే విషయం మరోసారి నిరూపించాడు.