బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాని మళ్ళీ కెఎస్ రవికుమార్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు.ఇక ఈ సినిమా ఓపెనింగ్ కూడా అయిపొయింది.
బోయపాటితో నెక్స్ట్ సినిమా చేస్తానని చెప్పిన దానిని పక్కన పెట్టి ముందుగా ఈ సినిమాని పట్టాలు ఎక్కించాడు.ఇక ఈ సినిమాకి రూలర్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్ గా ఇప్పటికే బాలకృష్ణ తో రెండు సినిమాలు చేసిన సోనాల్ చౌహాన్ ని మళ్ళీ ఫైనల్ చేసారు.మరో కీలక పాత్రలో భూమికని ఎంపిక చేసారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్లనుంది.
ఇక ఈ సినిమాలో బాలయ్యకి యాంటీ కాంబినేషన్ లో ఒకప్పటి బాలయ్య హీరోయిన్, సింహ సినిమాతో బాలకృష్ణతో కలిసి ఆడిపాడిన నమితని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
పవర్ ఫుల్ ఫిమేల్ లీడ్ కావడంతో దీనికి నమిత అయితే బెటర్ అని ఆమెని దర్శకుడు సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక పెళ్లి తర్వాత సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఈ భామకి ఇది మంచి రీ ఎంట్రీ అవుతుందని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనని మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది అని వెంటనే ఆమె అంగీకరించినట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే దీనిపై ఇంకా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా టాలీవుడ్ లో మాత్రం బలంగా వినిపిస్తుంది.