పూరీతో కేజీఎఫ్ హీరో! టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్

స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు.చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరీకి ఈ సినిమా ఫుల్ మీల్స్ గా దొరికింది.

 Puri Jagannath Plan To Movie With Raking Star Yash-TeluguStop.com

పూరీ స్టామిన చూపిస్తూ ఇది ఇప్పటికే ఎబ్భై కోట్లకి పైగా కలెక్షన్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది.తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా మీద పూరీ పెద్దగా నమ్మకం లేకపోయినా ఊహించని విజయాన్ని అందించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ ఎవరితో సినిమా తీస్తాడు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.దీనిపై ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.

కేజీఎఫ్ సినిమాతో సౌత్ స్టార్ గా మారిపోయిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో పూరీ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.పూరీ శైలికి కరెక్ట్ గా సరిపోయే యష్ తో సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనుకున్న జనగణమన సినిమాని తెరకెక్కిస్తే మంచి బజ్ ఉంటుందని పూరీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక యష్ కూడా పూరీతో సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడని తెలుస్తుంది.పూరీ జగన్నాథ్ ఇప్పటికే అక్కడ స్టార్ హీరోగా ఉన్న పునీత్ రాజ్ కుమార్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడుగా గుర్తింపు ఉంది.

పూరీ దర్శకత్వంలో వచ్చిన పోకిరి మూవీ కన్నడలో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.ఈ నేపధ్యంలో యష్ పూరీతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది.

ఈ ఇద్దరి కాంబినేషన్ కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube