బిగ్‌బాస్‌ నుండి మరో కీలక ప్రకటన రాబోతుంది... ఎదురు చూపులకు తెర

తెలుగు బిగ్‌ బాస్‌ మొదటి రెండు సీజన్‌లు మంచి విజయాలను దక్కించుకున్న నేపథ్యంలో మూడవ సీజన్‌ కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 3 త్వరలో ప్రారంభం కాబోతుంది అంటూ తాజాగా స్టార్‌ మాటీవీలో ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.

 Star Maa Big Boss Update1 1 1-TeluguStop.com

ప్రోమో విడుదలైన నేపథ్యంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా షో కోసం ఎదురు చూస్తున్నారు.ఇక మూడవ సీజన్‌ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్న వారు హోస్ట్‌ ఎవరా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 హోస్ట్‌ విషయంలో స్టార్‌ మా అధికారికంగా క్లారిటీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.జూన్‌ చివరి వారంలో నాగార్జున హోస్ట్‌ అంటూ కొత్త ప్రోమో విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే నాగార్జున పై ఒక షూట్‌ కూడా చేసినట్లుగా సమాచారం అందుతోంది.రెండు రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జునపై షూట్‌ చేశారని, ప్రస్తుతం ఎడిటింగ్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

బిగ్‌ బాస్‌ కోసం నాగార్జున ప్రత్యేకంగా సిద్దం అవుతున్నాడట.

బిగ్‌బాస్‌ నుండి మరో కీలక ప్ర

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కోసం నాగార్జున భారీ పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.నాగార్జున గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో పాల్గొని అనుభవం దక్కించుకున్నాడు.అందుకే బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి నాగ్‌ హోస్ట్‌ అయితే ఈజీగానే నెట్టుకు రాగలడుఅనే నమ్మకం అందరిలో ఉంది.

మరో మూడు నాలుగు రోజుల్లో నాగార్జున హోస్ట్‌ అంటూ కీలక ప్రకటన చేయబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు.జులై రెండవ లేదా మూడవ వారంలో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రారంభం కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube