నరసాపురంలో 'మెగా' పవర్ ఎంత ? నాగబాబుకు కలిసొస్తుందా ?

అన్ని పార్టీలకు ఎంతో కీలకమైన గోదావరి జిల్లాల్లో ప్రతి పార్టీ అత్యధిక సీట్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటాయి.ఈ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు ఎవరు దక్కించుకుంటే వారికే అధికారం అన్నట్టుగా ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది.

 Does Mega Power Favours Naga Babu In Narsapuram-TeluguStop.com

అందుకే అన్ని ప్రధాన పార్టీలు ఇక్కడ పట్టు సాధించేందుకు ఇంత గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ అధినేత సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించాలని పవన్ కంకణం కట్టుకున్నాడు.

అందుకే వ్యూహాత్మకంగా పవన్ ఇదే జిల్లాలో ఉన్న భీమవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నాడు.పనిలో పనిగా నరసాపురం నుంచి పార్లమెంట్ స్థానాన్ని తన అన్న నాగేంద్ర బాబు కి కేటాయించాడు.

ఈ మేరకు కొన్ని సర్వేలు కూడా చేయించినట్టు తెలుస్తోంది.అందుకే ఇతర ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేసిన తరువాత నాగబాబుకు మంచి అవకాశం ఉంటుందని అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

నాగబాబు రంగంలో ఉండటంతో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ పెరిగిపోతున్నాయి.నరసాపురం పార్లమెంట్ బరిలో హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు.

టీడీపీ నుంచి ఉండి ఎమ్యెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు , వైసీపీ నుంచి కనుమూరి రఘురామకృష్ణంరాజు లు పోటీ పడుతున్నారు.నాగబాబు రంగంలోకి దిగకపోతే పోటీ రెండు పార్టీల మధ్యే ఉంటుందని అంతా అనుకునేవారు కానీ నేరుగా నాగేంద్రబాబు రంగంలో ఉండటం ఈ నియోజకవర్గం పరిధిలోనే పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం కూడా ఉండటంతో అందరి చూపు ఇక్కడే కేంద్రీకృతం అయ్యింది.

అందుకే ప్రధాన పార్టీలన్నీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

నరసాపురం నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే మొదటి నుంచి ఇక్కడ క్షత్రియ సామజిక వర్గానికి చెందిన వారికే ఎక్కువ ఇక్కడ సీటు దక్కుతోంది.కాకపోతే ఇప్పుడు ఆ ఆనవాయితీ మార్చుతూ పవన్ తన సోదరుడిని దించాడు.గతంలో నర్సాపురం నుంచి కాపు సామాజికవర్గం నేతలు పలువురు విజయం సాధించారు.

చేగొండి హరిరామజోగయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి వారు కాంగ్రెస్, టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాపు సామాజికవర్గం ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు.

వైసీపీ టీడీపీ కూడా క్షత్రియులకు టికెట్లు ఇవ్వడంతో వారి ఓట్లు చీలి తమకు మేలు చేస్తుందని జనసేన అంచనా వేస్తోంది.ఈ సామజిక వర్గాల లెక్కల్లో జనసేన అంచనా ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube