దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోర్కెలు తీర్చుతాడని అంతా నమ్ముతున్నారు.అయితే కొందరు ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు.
పూజలు చేసేందుకు సమయం సందర్బం అంటూ ఏం అక్కర్లేదని కొందరు అనుకుంటారు.కాని దేనికైనా సమయం సందర్బం అనేది తప్పనిసరి అంటూ పెద్దలు అంటారు.
ఏ పనికైనా సమయం సందర్బం చూసుకోవాలన్నప్పుడు చాలా పవిత్రంగా చేసే పూజ విషయంలో మరెంత జాగ్రత్తగా, సమయ పాలన చేయాలి చెప్పండి.తిరుపతితో పాటు ప్రముఖ దైవ క్షేత్రాల్లో సమయ పాలనతో పూజలు చేయడం మనం గమనిస్తూనే ఉంటాం.
అంటే ఉదయం ఈ సేవ, రాత్రి ఈ సేవ అన్నట్లుగా పూజలు ఉంటాయి.
అలాంటి పెద్ద దైవ క్షేత్రాల్లోనే సమయంకు పూజలు నిర్వహిస్తారు.
అలాంటిది చిన్న పూజలైనా కూడా సమయం పాటించకుంటే ఎలా, అందుకే ఏ సమయంలో పూజలు నిర్వహించుకోవాలో పెద్దలు, హిందూ ధర్మ ప్రచారకులు చెప్పారు.పూజల విషయంలో ఎంతో మంది సమయ పాలన పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ, పూజలు చేస్తూ ఉంటారు.
అలా చేయడం చాలా పెద్ద తప్పు అనేది హిందూ ధర్మ గురువు ఒకరు చెప్పారు.ఇంట్లో పూజ అయినా కూడా కాస్త అటు ఇటు అయితే పర్వాలేదు కాని మరీ మిట్ట మద్యాహ్నం చేయడం ఏమాత్రం సబబు కాదు.
ప్రత్యేక పూజల విషయాన్ని పక్కన పెడితే ప్రతి వారం లేదా ప్రతి రోజు చేసుకునే సేవలు మరియు దైవ ప్రార్థనలు ఉదయం పది గంటల లోపు పూర్తి చేస్తే ఉత్తమం.కాస్త ఆలస్యం అయితే 11 గంటల వరకు పర్వాలేదు.కాని మిట్ట మద్యాహ్నం సమయంలో పూజ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని పండితులు అంటున్నారు.ఇక రాత్రి సమయంలో పూజలు కూడా సరైన పద్దతి కాదట.
రాత్రి పూజలు కేవలం దుష్ట శక్తులను ఆవాహనం చేసుకునేందుకు తప్ప దైవానుగ్రహం పొందలేమని, అందుకే తెల్లవారు జామున చేసే పూజల వల్ల సత్పలితాలు దక్కుతాయని పండితులు గట్టిగా చెబుతున్నారు.ఎంత పూజైనా ఉదయం 8 గంటల వరకు పూర్తి చేసుకుంటే బెటర్.
ఇంట్లో పనులు, అవి ఇవి ఉన్న వారు కాస్త ఆలస్యం అయితే ఏమో కాని మరీ మిట్ట మద్యాహ్నం పూజ పెట్టుకోవద్దు.దైవానుగ్రహం పొందాలంటే ఏ సమయం అయితే ఏంటీ అనుకుంటారు, కాని ఇలా పూజ చేసి చూడండి, పోయేదేముంది.
DEVOTIONAL