రవితేజ గత కొంత కాలంగా కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.‘రాజా ది గ్రేట్’ చిత్రం మినహా గడచిన కొంత కాలంగా రవితేజకు ఏ ఒక్క చిత్రం సక్సెస్‌ను దక్కించి పెట్టలేదు.
ఈమద్య కాలంలో వచ్చిన టచ్ చేసి చూడు మరియు నేల టికెట్ చిత్రాలు కనీసం పబ్లిసిటీ ఖర్చులను కూడా మిగల్చలేక పోయాయి అనేది అందరికి తెల్సిన సత్యం.ఇక తాజాగా ఈయన శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు.
శ్రీనువైట్లకు ఈ చిత్రం చాలా కీలకం.నాలుగు వరుస ఫ్లాప్‌లు అవ్వడంతో శ్రీనువైట్లకు ఈ చిత్రం సక్సెస్ అయితేనే తర్వాత సినిమా ఉంటుంది.రవితేజ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది.
అందుకే ఈ చిత్రంకు ప్రస్తుతం భారీ స్థాయిలో క్రేజ్‌ను తీసుకు వచ్చేందుకు దర్శకుడు శ్రీనువైట్ల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.అందులో భాగంగానే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానాను తీసుకు వచ్చాడు.
మొదట అను ఎమాన్యూల్‌ను ఎంపిక చేసిన దర్శకుడు శ్రీనువైట్ల ఆ తర్వాత ఆమెను తొలగించి ఇలియానను ఎంపిక చేయడం జరిగింది.ఇలియానా ఎంట్రీతో సినిమా స్థాయి పెరిగి పోయింది.
సినిమా క్రేజ్‌ను మరింతగా పెంచేందుకు దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రంలో స్టార్ కిడ్ ఉండాలని భావించాడు.రవితేజ చిన్నప్పటి పాత్రను ప్రముఖ నటుడి కుమారుడితో లేదా నోటెడ్ కుర్రాడితో చేయిస్తే బాగుంటుందని, సినిమాకు క్రేజ్ పెరుగుతుందని భావించాడు.
అందుకోసమే మహేష్‌బాబు తనయుడు గౌతమ్ కృష్ణను ఈ చిత్రంలో నటింజేసేందుకు సిద్దం అయ్యాడు.మహేష్‌తో ఉన్న సన్నిహిత్యంతో స్వయంగా మహేష్‌ను కలిసి గౌతమ్‌ను తన సినిమాలో నటింపజేయాలని కోరాడు.
అయితే ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టిన గౌతమ్‌ను కదిలించదల్చుకోలేదు అని, నటనపై ప్రస్తుతం గౌతమ్‌కు ఆసక్తి లేదన్నట్లుగా సమాధానం ఇచ్చాడు.దాంతో రవితేజ చిన్నప్పటి పాత్ర కోసం వేరే బాల నటుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు.
రవితేజ తనయుడు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తుంది.మొత్తానికి శ్రీనువైట్ల ప్రయత్నం బెడిసి కొట్టింది.
ఆశ అత్యాశ అయ్యింది.