కృష్ణా జిల్లాలో ఘోరం..బీటెక్ విద్యార్ధినిపై అత్యాచారం ..

ఏపీ రాజధాని ప్రధాన జిల్లా అయిన కృష్ణా లోని ఆగిరిపల్లి లో ఘోరం జరిగింది.బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్‌ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన జరిగి మూడేళ్ళు అయ్యింది అయితే తాజాగా జరిగిన ఒక ఘటనతో మళ్ళీ తెరపైకి వచ్చిన విషయం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనం అయ్యింది…పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

 B Tech Graduate Gang Raped By Formerclass Mates-TeluguStop.com

2015 ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని తన తోటి విద్యార్థి వంశీకృష్ణ తన పుట్టిన రోజు పార్టీ ఇస్తానని చెప్పి మరో సీనియర్‌ శివారెడ్డితో కలిసి ఆగిరిపల్లిలోని ఓ గదికి తీసుకువెళ్లాడు.అయితే పార్టీ అన్నారు గదిలో ఎవరూ లేరు అని ఆమె అడిగేలోగానే ఆమెపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి ఆ ఘాతుకాన్ని కెమెరాలో భంధించారు.ఈ విషయం ఎవరికైనా చెప్తే ఈ వీడియో ని బహిర్గతం చేస్తామని బెదిరించారు

అయితే అప్పటి నుంచీ ఆ విద్యార్ధిని తీవ్రమనో వేదనకి గురవ్వడంతో ఇంట్లో అనుమానం వచ్చిన తల్లి తండ్రులు గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పింది.

దీంతో 2018 మే నెలలో కళాశాల యాజమాన్యానికి జరిగిన ఉదంతంపై విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేశారు.దీంతో ఆ విద్యార్థులను కళాశాల యాజమాన్యం మందలించి వదిలేసింది.సమస్య తీరిపోయింది అనుకున్నారు.అయితే

అత్యాచారం చేసిన విద్యార్థి స్నేహితుడు ప్రవీణ్‌ ఇటీవల చరవాణి ద్వారా విద్యార్థినిపై బెదిరింపులకు పాల్పడ్డాడు…ఈ వీడియో తన వద్ద ఉందని రూ.10లక్షలు ఇవ్వాలని లేకపోతే ఆ వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు.అయితే ఇదే వీడియో గ్రామంలో ఒకరిద్దరి వద్ద ఉందని తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube