కామంతో కొట్టుకు పోతూ మృగాళ్ళు బరితెగిస్తున్నారు.రోజు రోజు కి దేశవ్యాప్తంగా ఎదో ఒక చోట ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
అన్యం పుణ్యం ఎరుగని పసి పాపలపై కూడా రాక్షసత్వంగా అత్యాచారాలకి పాల్పడుతున్నారు.తల్లీ, కూతుర్ని నిర్భందించి ఆపై అత్యాచారం చేసిన దారుణం పాట్నా లో వెలుగు చూసింది.
ఈ దారుణం జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులని పట్టుకున్నారు.వివరాలలోకి వెళ్తే .
గురౌరు బజార్‌లో క్లినిక్ నిర్వహిస్తున్న ఒక డాక్టర్ బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో క్లినిక్ మూసేసి, భార్య, కూతురితో సహా తన బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు.అదే సమయంలో రఫిగంజ్-గయ రోడ్డులో ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఒక్క సారిగా 20 మంది వారిని చుట్టు ముట్టారు.డాక్టర్ కూతురు మహిలని వేదిస్తూ అతడిని కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి పోలాలలో పడేశారు అతడి భార్య కూతురు ని వేరే ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళి అత్యంత దారుణంగా రేప్ చేశారు.వారి కేకలు విన్న అక్కడి గ్రామస్తులు అక్కడికి వచ్చేలోగానే వారు ఆ ఇద్దరినీ చెట్టుకి కట్టేసి వెళ్ళిపోయారు.
అయితే భాదితులు ఫిర్యాదు చేసినా సరే పోలీసులు పట్టించుకోక పోవడంతో ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఐజీ నయ్యర్ హసనైన్ ఖాన్ స్వయంగా కేసును పర్యవేక్షించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిని సస్పెండ్ చేశారు.
కేసు నమోదైన గంటల వ్యవధిల్లోనే నిందితులందరినీ అరెస్ట్ చేశారు.భాదితులకి న్యాయం చేశారు.
ఈ దుండగులు స్థానికంగా వెళ్తున్న కొందరు మహిళలను కూడా వేధించారని, ఇద్దరు యువకుల దగ్గర ఫోన్లు, డబ్బు లాక్కున్నట్లు తేలింది…అయితే ఈ వార్త బీహార్ ని తలాకుతలం చేసింది.