మనం అభిమానించే హీరో గురించి, వారి ఫ్యామిలీ ఎవరు ఏంటి అని ఇలా ప్రతి ఒక్కటీ తెలుసుకుంటాం.మన టాలీవుడ్ లో టాప్ హీరోలుగా అలరిస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఈ స్టార్ హీరోలు డైలీ లైఫ్, వారి ఫ్యామిలీ, పిల్లలు ప్రతి ఒక్కరికీ తెలుసు.
అయితే వారితో పాటు టాప్ స్టార్ హీరోగా అలరిస్తున్న విక్టరీ వెంకటేష్ గురించి తప్ప, వెంకటేష్ భార్య? వెంకీ పిల్లలు ఎవరు? వారు ఎం చేస్తున్నారు? లాంటి విషయాలు ఎవ్వరికీ తెలీవు.

వెంకటేష్ తన భార్యను, తన పిల్లలను ఎప్పుడూ సినిమా ఫంక్షన్ లకు గానీ? బయటజరిగే ప్రోగ్రామ్స్ కు గానీ తన ఫ్యామిలీని తీసుకురాడు? వెంకటేష్ కొడుకు అర్జున్ తప్ప, వెంకటేష్ పిల్లలెవరూ ఏ కార్యక్రమంలోనూ మనకు కనిపించరు? అయితే వెంకటేష్ ఫామిలీ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీరు చూడండి!
చౌదరి సామజిక వర్గానికి చెందిన వెంకటేష్ భార్య నీరజ.రెడ్డి కుటుంబం నుంచి వచ్చారు.వెంకటేష్ ని హీరోగా పరిచయం చేయాలనుకున్న తన తండ్రి రామానాయుడు కొడుకును బాగా అర్ధం చేసుకోగలా ఒక మంచి అమ్మాయి కావాలని మద్రాస్ లో ఉన్నప్పుడు ప్రముఖ నిర్మాత అయిన విజయ నాగి రెడ్డి ని అడిగారట.
అందుకు ఆయన మీ సామజిక వర్గంలో ఏమో కాని మాకు సమీప బంధువులలో ఒక అమ్మాయి ఉందని, ఆమెకు ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారని నాగిరెడ్డి చెప్పారట.దీంతో రామానాయుడు నాకు అలాంటి పట్టింపులు ఏమి లేవని చప్పడంతో తన బంధువు అయిన చిత్తూరు జిల్లా గంగవరపు సుబ్బారెడ్డి గారి కుమార్తె నీరజ రెడ్డి ని రామానాయుడికి చూపించడం, ఆయనతోపాటు వెంకటేష్ కి కూడా ఆమెను చూపించడం, దాంతో నీరజ రెడ్డికి కూడా వెంకటేష్ నచ్చడంతో వారి పెళ్లి అంగరంగ వైభోవంగా జరిగింది.

వెంకటేష్ నీరజ లకి మొత్తం నలుగురు సంతానం.వారిలో ముగ్గుర అమ్మాయిలు.ఒక అబ్బాయి .నీరజ వెంకటేష్ ల కూతుర్ల పేర్లు ఆశ్రిత, హయవాహిని, భావన కాగా కొడుకు పేరు అర్జున్ రామ్‌నాథ్ దగ్గుబాటి ఇంట్లో పిల్లకి అవసరం అయ్యే ప్రతి పని నీరజ గారే దగ్గర ఉంది మరి చూసుకుంటారు .నీరజ గారికి వెంకటేష్ అంటే ఎంత ఇష్టం అంటే వెంకీ షూటింగ్ వెళ్ళే ప్రతి రోజు దేవుడు హరితి ఇచ్చి కార్ కి తను ఎదురువచ్చి మరి వెళ్తుంది .నీరజ గారు ఎంబీఏ ని అమెరికాలో చదివారు.