అల్సర్, అజీర్ణం, టాక్సిన్స్ .ఇలాంటి చెత్తచెదారాల గురించి మన పూర్వికులకి పెద్దగా తెలియదు.
అందుకు కారణం కేవలం కెమికల్స్ లేని తిండి పదార్థాలే కాదు, మలీనాలు లేని మంచినీరు కూడా.రాగి చెంబులే వారి చేతిలో వాటర్ ఫిల్టర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు.
కాల క్రమేనా రాగిని పూర్తిగా పక్కన పెట్టేస్తూ పోయారు.కాని మనం ఎంతలా నష్టపోతుమున్నామో మనకు తెలియదు.
రాగి పాత్రలతో మంచినీరు తాగితే శరీరానికి ఎంత లాభమో మీరే చూడండి.
* రాగి పాత్రలు ఒలిగోడైనామిక్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి.
దాంతో రాగి పాత్రల్లో బ్యాక్టీరియా బ్రతకడం కష్టం.రాగి పాత్రల్లో నీళ్ళను భేషుగ్గా, ఎలాంటి భయం లేకుండా తాగవచ్చు.
* డీటాక్సీఫికేషణ్ అంటే శరీరంలో ఉన్న మలీనాలను బయటకి తోయడం.రోజుకి సరిపడా మంచి నీళ్ళు తాగడమే దీనికి మార్గం.అందులోనూ, రాగి పాత్రలోని నీళ్ళు తాగితే ఇంకా మంచిది.పైన చెప్పినట్టుగా, రాగి పాత్రల్లో బ్యాక్టీరియా బ్రతకడం కష్టం.కాబట్టి ఎలాంటి మలీనాలు లేని నీళ్ళు తాగితే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు.
* రాగి పాత్రలో మంచినీరు తాగడం వలన జీర్ణ వ్యవస్థ కూడా మరింత మెరుగ్గా పనిచేస్తుంది.
రాగి పాత్రలోని మంచినీరు పేరిస్టాల్సిస్ అనే ప్రాసెస్ ని ప్రేరేపిస్తాయి.అంటే కడుపులోని కండరాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి పనితనం చూపిస్తాయన్నమాట.దీంతో కడుపులో మంట, అజీర్ణం, అల్సర్స్ లాంటి సమస్యలు దూరంగా ఉంటాయి.
* రాగి పాత్రలోని మంచినీరు తాగడం వలన శరీరంలో మెలనిన్ అనే హార్మోన్ తగిన పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది.
ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన ముఖం కాంతివంతంగా తయారువుతుంది.మొటిమలు, మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.
* రాగి పాత్రలో నీళ్ళు తాగడం వలన యాంటి ఆక్సిడెంట్లు కూడా దొరుకుతాయి.దాంతో ఫ్రీ రాడికల్స్ అంతం అవుతాయి.
కేవలం రోగనిరోధక శక్తి పెరగటమే కాదు, మన వయసు కన్నా తక్కువగా, అందంగా కనబడతాం.