జుట్టు ఒత్తుగా,నిగనిగలాడుతూ ఉండాలంటే..... కొన్ని జాగ్రత్తలు

ప్రతి అమ్మాయికి జుట్టు ఒత్తుగా, ఆకర్షణీయంగా, నిగనిగలాడుతూ ఉండాలనే కోరిక ఉంటుంది.అలాంటి జుట్టు సొంతం చేసుకోవాలంటే తలస్నానము చేసే దగ్గర నుంచి దువ్వుకొనేవరకు కొన్ని పొరపాట్లను చేయకుండా ఉండాలి.

 Hair Loss, Causes Of Hair Fall, Hair Dryer, Head Bath, Hair Growth Tips-TeluguStop.com

ఇప్పుడు ఆ పొరపాట్లను తెలుసుకుందాం.చాలా మంది తలస్నానము చేసే ముందు తలను దువ్వుకోరు.

దాని వల్ల జుట్టు ఎక్కువగా ఊడి పోయే ప్రమాదం ఉంది.ఎలా అంటే జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎక్కువగా చిక్కులు పడుతుంది.

అది ఆరాక దువ్వుకుంటే జుట్టు ఎక్కువగా ఊడే ప్రమాదం ఉంది.

చాలా మంది జుట్టు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో అతి జాగ్రత్తతో ప్రతి రోజు తలస్నానము చేస్తూ ఉంటారు.

కానీ ఆ విధంగా చేయటం వలన తలలోని సహజమైన నూనెలు పోయి జుట్టు కళ లేక జీవం కోల్పోతుంది.అందువల్ల తలస్నానము అనేది రెండు రోజులకు ఒకసారి చేస్తే సరిపోతుంది.

 తడి తలను హెయిర్ డ్రైయర్ తో ఆరబెట్టకుండా పొడి టవల్ తో తుడిస్తే మంచిది.అదే పనిగా టవల్ తో బలంగా తుడిస్తే జుట్టు చిట్లిపోయే ప్రమాదం ఉంది.

అందువల్ల నిదానంగా తుడవాలి.జుట్టు తడిగా ఉన్నప్పుడు కర్లింగ్ చేయటం వంటివి చేస్తే జుట్టు కుదుళ్లకు హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube