షార్ట్ ఫిలింస్ హీరోయిన్ అనగానే అందరికి గుర్తొచ్చే చాందిని చౌదరి వెండితెర మీద మాత్రం అంత మెరుపులు మెరిపించలేకపోతుంది.హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చినా లేకున్నా కాని స్టార్ హీరోల సినిమాల్లో అలా కనిపించి కనిపించని క్యారక్టర్స్ అయితే అసలు చేయనని చెబుతుంది చాందిని.
రీసెంట్ గా బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ మరదలిగా కనిపించిన ఈ అమ్మడు సినిమాలో కనిపించిదే తప్ప కనీసం ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు.అందుకే ఇక అలాంటి సినిమాలు చేసేది లేదు అంటూ తెగేసి చెబుతుంది.
బ్రహ్మోత్సవం అయితే మహేష్ కోసం ఓకే అన్నా కాని ఇకనుండి అలా చిన్న పాత్రలైతే అసలు ఒప్పుకోనంటుంది.ప్రస్తుతం కుందనపు బొమ్మ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న చాందిని ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది.
ముళ్ళపూడి వర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించారు.చాందిని చేసిన మొదటి సినిమా కేటుగాడు ఫ్లాప్ అవ్వగా రెండో ప్రయత్నంగా ఈ కుందనపు బొమ్మతో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటుంది.
మరి యూ ట్యూబ్ లో సూపర్ క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీ వెండితెర మీద సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
.