మామూలుగా మనలో 100కి 98 మంది ఒక చిన్న పామును చూస్తే గజ గజ లాడిపోతాం.కానీ కొందరు మాత్రం ఎంతో ధైర్యంగా వాటిని పట్టుకుంటూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ ఉంటారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఎనిమిది సంవత్సరాలు ఉన్న ఓ చిన్నారి పాము తో ఫ్రెండ్షిప్ తెగ చేసేస్తోంది.
అంతే కాదండి.ఆ పాము తో కలిసి స్విమ్మింగ్ పూల్ లో కూడా ఈత కొట్టేస్తుంది.
ప్రస్తుతం ఆ పాము, అమ్మాయి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మామూలుగా మనకి చిన్న పాము చూస్తేనే వనిగిపోతాం.
అక్కడ ఎక్కడో పాము ఉంది అంటే అటువైపు కూడా తొంగి చూడం మనం.అయితే ఇజ్రాయిల్ దేశానికి చెందిన 8 సంవత్సరాల పాప మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నం.11 అడుగుల కొండచిలువ, ఆ చిన్నారి బాగా ఫ్రెండ్స్.ఆ అమ్మాయికి ఏలాంటి స్నేహితులు లేరు.
కేవలం ఆ పాము, అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్.ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఇన్బార్ అమ్మాయి చిన్నప్పుడు నుంచి ఓ పాము తో పెరుగుతూ వస్తోంది.
దీంతో వారిద్దరి మధ్య బాగా ఫ్రెండ్షిప్ కుదిరింది.అంతే కాదండి తన ఫ్రెండ్ పాముకు బలే అని పేరు కూడా పెట్టింది.
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్నా ఆ అమ్మాయి కి పూర్తిగా ఆ పాము కంపెనీ ఇస్తోందట.ఇక ఈ విషయం గురించి ఆ అమ్మాయి స్పందిస్తూ తనకు పాముతో సమయం గడపడం అంటే తనకు ఎంతగానో ఇష్టమని, అంతే కాకుండా అవి సంతోషంగా ఉండడానికి సహాయం చేస్తున్నట్లు తెలియజేసింది.
అయితే కేవలం ఈ అమ్మాయి మాత్రమే కాదు.ఇజ్రాయిల్ దేశం లో చాలా మంది వ్యవసాయ కుటుంబాలకు చెందిన కొందరు వివిధ జంతువులను పెంచుకోవడానికి చాలా బాగా ఇష్టపడతారు.
చిన్నప్పుడు నుండి ఇద్దరు కలిసి పెరగడంతో ప్రస్తుతం ఆ పాము కూడా చాలా పెద్దది అయిపోయింది.అయినా కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఆ పాము తో కలిసి ఆడుకుంటుంది.
ఇదంతా మాకు అత్యంత సహజం అంటూ ఆ అమ్మాయి తల్లి సరిత్ తెలిపారు.ఇంకెందుకు ఆలస్యం ఆ అమ్మాయి, పాము ఇద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూసేయండి.