ఒక్క ఏడాది లో 3000 వేల కోట్లు..బాలీవుడ్ కి ఊపిరి పోసిన షారుఖ్ ఖాన్!

కరోనా లాక్ డౌన్ తర్వాత పూర్తిగా స్లంప్ లోకి వెళ్లిన ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే , అది బాలీవుడ్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూ బాక్స్ ఆఫీస్ రేస్ లో బాగా వెనకపడింది.

 3000 Thousand Crores In One Year Shah Rukh Khan Who Breathed Life Into Bollywood-TeluguStop.com

అలాంటి సమయం లో షారుఖ్ ఖాన్ కారణం గా ఈ ఇండస్ట్రీ కి మామూలు ఆదాయం రాలేదు.ఈ ఏడాది ప్రారంభం లో ‘పఠాన్’( Pathan ) సినిమాతో ఇండస్ట్రీ లో ఆయన పెట్టిన రికార్డ్స్ ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అప్పటోయ్ వరకు వెయ్యి కోట్ల రూపాయిల సినిమాలు ఉన్న ఇండస్ట్రీ గా మన సౌత్ మూవీస్ మాత్రమే ఉండేవి.కానీ ‘పఠాన్’ చిత్రం బాలీవుడ్ లో మొట్టమొదటి వెయ్యి కోట్ల రూపాయిల హిందీ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

Telugu Thousand, Bollywood, Gaddar, Jawan, Shah Rukh Khan-Movie

ఈ సినిమా తర్వాత బాలీవుడ్( Bollywood ) మళ్ళీ స్లంప్ పీరియడ్ ని ఎదురుకుంది.ఎదో ఒకటి రెండు సినిమాలు తప్ప, విడుదలైన ప్రతీ సినిమా ఫ్లాప్ గా నిలుస్తూ వచ్చింది.అలాంటి సమయం లో సన్నీ డియోల్ హీరో గా నటించిన ‘గద్దర్ 2 ‘ ( Gaddar 2 )చిత్రం బాలీవుడ్ ని షేక్ చేసి 800 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది.

ఈ చిత్రం తో పాటుగా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్ 2 ‘ చిత్రం కూడా 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి సూపర్ హిట్ గా నిల్చింది.ఈ రెండు సినిమాల తర్వాత విడుదలైన షారుఖ్ ఖాన్ మరో చిత్రం ‘జవాన్’ ( Jawan )సృష్టిస్తున్న ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ఊచకోత ఇంకా జరుగుతూనే ఉంది.

Telugu Thousand, Bollywood, Gaddar, Jawan, Shah Rukh Khan-Movie

ఈ సినిమా ఈ వీకెండ్ తో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడితే, బాలీవుడ్ లో ఒకే ఏడాది 2000 కోట్ల రూపాయిల ఆదాయం ని రప్పించిన ఏకైక హీరోగా షారుఖ్ ఖాన్ చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు.ఈ రెండు సినిమాల తర్వాత ఆయన బాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో ‘దుంకీ’ అనే చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది.

ఈ డైరెక్టర్ నుండి ఇప్పటి వరకు ‘మున్నా భాయ్ MBBS’,’లగేరహో మున్నాభాయ్’,’పీకే’, ‘3 ఇడియట్స్’, ‘సంజు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ ని తీసాడు.అలాంటి స్టార్ డైరెక్టర్ తో షారుఖ్ ఖాన్ సినిమా చేస్తే మరో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం అంత కష్టమేమి కాదు.

ఈ సినిమా కూడా వెయ్యి కోట్లు కొడితే ఒకే ఏడాది 3000 వేల కోట్ల రూపాయిల బిజినెస్ ని చేసిన ఏకైక హీరో గా షారుఖ్ ఖాన్ చరిత్ర లో నిల్చిపోతాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube