15 దేశాలు.. 200 మంది భారతీయులు, ప్రపంచ రాజకీయాలపై మన ముద్ర

వృత్తి, వ్యాపార, ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ ఉన్నత పదవులను దక్కించుకుంటున్నారు.అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికకావడంతో భారతీయుల సత్తాపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

 200 Indian Origin People Occupy Leadership Positions In 15 Countries, Indians, U-TeluguStop.com

అయితే ఒక్క అమెరికాయే కాకుండా ఎన్నో దేశాల ప్రభుత్వ వ్యవస్థలను భారతీయులు నియంత్రిస్తున్నారు.ఇలా ఏయే దేశాల్లో భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారో వారి జాబితాను అమెరికాకు చెందిన ఓ సంస్థ విడుదల చేసింది.

ప్రవాస భారతీయుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న అమెరికాకు చెందిన ఇండియాస్పోరా ‘‘ఈ గవర్నమెంట్ లీడర్స్ 2021’’ జాబితాను ప్రకటించింది.దీని ప్రకారం అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచంలోని 15 దేశాల్లో 200 మంది భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో ఉన్నట్లు పేర్కింది.

వీరిలో 60 మంది వరకు క్యాబినెట్ హోదాలో ఉన్నారట.వివిధ దేశాల ప్రభుత్వ వెబ్‌సైట్‌లతో పాటు ఇతర మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి, జాబితాను తయారు చేసింది ఇండియాస్పోరా.

కాగా, 2021 ఇండియాస్పోరా గవర్నమెంట్ లీడర్స్ జాబితాలోని అధికారులు ప్రపంచంలోని 587 మిలియన్ల మంది జనాభాకుపైగా ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), యూకే, యూఎస్ వంటి దేశాలున్నాయి.

దౌత్యవేత్తలు, శాసనసభ్యులు, సెంట్రల్ బ్యాంకుల అధిపతులు, సీనియర్ ప్రభుత్వోద్యోగులు ఈ లిస్ట్‌లో ఎక్కువగా ఉన్నారు.

చదువులు, ఉద్యోగం, వ్యాపారం ఇలా కారణం ఏదైనా ప్రపంచ వ్యాప్తంగా వలసల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ డివిజన్, తాజాగా విడుదల చేసిన ‘ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ 2020 హైలైట్స్‌’ నివేదిక, 2020లో 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వలస వెళ్ళినట్లు వెల్లడించింది.భారత్‌ నుంచి వలస వెళ్ళిన అత్యధిక మందికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియాలు ఆశ్రయం కల్పిస్తోన్నాయి.

ఇక ఎన్ఆర్ఐలకు భారత దేశం తర్వాత మరో ఇల్లుగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) మారింది.

ప్రపంచంలోనే అత్యధికంగా 35 లక్షల మంది ప్రవాస భారతీయులు యూఏఈలో నివాసముంటుండగా, అమెరికాలో 27 లక్షలు, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది ఉంటున్నారు.ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్‌లో కూడా భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్నారు.అంతర్జాతీయంగా అత్యధిక మంది వలసలకు ఆశ్రయం ఇస్తోన్న దేశం అమెరికా.2020లో 5.1 కోట్ల మంది వివిధ దేశాలకు చెందిన ప్రజలు అమెరికాకి వలస వెళ్ళారు.ఇది ప్రపంచంలోని మొత్తం జనాభాలో 18 శాతానికి సమానం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube