ఏపీలో బీజేపీ వేసిన ప్లాన్..హర్యానాలో సీన్ రివర్స్

ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడుతారు ఈ సామెత భారత దేశంలో పుట్టిన ప్రతీ ఒక్కరికీ తెలుస్తుంది కానీ పాపం బీజేపీ కి మాత్రం తెలియరాలేదు.అందుకే కాబోలు ఏపీలో తానూ తీసిన గోతిలో తానే పడింది.

 Bjp Plans Reverse In Haryana-TeluguStop.com

అలా ఇలా కాదు బొక్కబోర్లా పడింది.ఏంటి అసలు విషయం చెప్పకుండా గొయ్యి నుయ్యి అంటున్నామనే కదా సరే అసలు విషయంలోకి వెళ్తే బీజేపి ని చూసి పాపం అనుకుంటూ పడీ పడీ నవ్వుతారు.

చంద్రబాబు ఎన్డీయే నుంచీ బయటకి వచ్చి బీజేపి పరువుని సెంట్రల్ లోని సెంటర్ లో తీసిపడేశారు ఈ దశలో మోడీ గారి పరువు దేసవ్యప్తంగా ఎలా పోయిందో వేరే చెప్పనవసరం లేదు ఆక్షణం నుంచీ మోడీ గారు చంద్రబాబు పై పెంచుకున్న పగని ఎలా తీచుకోవాలో అనుకున్న సమయంలో ఎన్నో వ్యుహాలని రచిస్తున్నారు.రంచించారు కూడా అయితే ఒక్కొక్కటి మెల్లగా జరుగుతున్నాయి అని తెలుస్తోంది.అయితే బిజెపి తాజాగా ఏపీలో చక్రం తిప్పాలని టీడీపీ ని భూస్తాపితం చేయాలనే తలంపుతో కుల రాజకీయ వ్యుహాలకి పదును పెట్టింది.అందులో భాగంగానే.

ఏపీలో కొందరు ముఖ్య బీసీ నేతలని తమవైపు తిప్పుకునేలా పక్కా ప్లాన్ సిద్దం చేసింది.ఏపీలో ప్రధానంగా రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి అయితే రెండు పార్టీలు కూడా కమ్మ మరియు రెడ్డి కులానికి సంభందించినవి వాళ్ళే అధికారంలో ఉంటున్నారు బీసీలకి అధికారం అక్కరలేదా అనే సన్నాయి నొక్కులు నొక్కుతూ మరో పక్క ఎస్సీ లని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.

అంతేనా తెలుగుదేశం పార్టీ కి ఎంతో బలమైన ఓటు బ్యాంక్ అయిన బీసీలని దూరం చేయడానికి కూడా వ్యూహాలు పన్నుతోంది.అయితే మొదట్లో చెప్పినట్టుగా ఎవరి గోతిలో వాళ్ళే పడతారు అనేట్టుగా ఏపీలో బీసీ లని తమవైపు తిప్పుకుని టీడీపీ కి దెబ్బకొట్టాలని అనుకుంటే

సీన్ రివర్స్ అయ్యింది.

ఒక పక్క హర్యానాలో అసెంబ్లీ 90 సీట్లలో 47 మాత్రమే బిజెపి గెలుచుకుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది…ఆ ఎన్నికల్లో చాలా కీలక నేతగా ఉన్న బిజెపి ఎంపీ రాజ్ కుమార్ సైని ఇప్పుడు బిజెపి పై యుద్ధం ప్రకటించాడు…ఈ తురుగుబాటుతో హర్యానాలో హనోహర్ లాల్ కట్టార్ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలబోతోందనే ప్రమాద సంచికలు వెళ్తున్నాయి.కురుక్షేత్రకు చెందిన బీజేపీ ఎంపీ, బీసీల్లో బలమైన నాయకుడిగా పేరున్న రాజ్ కుమార్ సైని ఈనెలలోనే కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను ప్రచారం చేసుకునేందుకు 64 ఏళ్ల సైనీ పట్టుదలగా ఉన్నారు.అంతేకాదు ఎంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, భారీ వాహన శ్రేణితో ఆయన ఐదు కిలోమీటర్ల మేర బలప్రదర్శన చేశారు.

అక్కడితో ఆగకుండా సొంత పార్టీ పై ప్రకటన కూడా చేశారు.దాంతో ఒక్కసారిగా బీజేపి ఉలిక్కిపడింది…ఇదే తడవుగా సైనీ అక్కడ బీజేపి కి ఎంతో బలమైన ఓటింగ్ ఉన్న ఓటు బ్యాంక్ టార్గెట్ గా బిజెపి మనల్ని మోదం చేయాలనీ అనుకుంటోంది.

మనం వేసే ఓట్లతో ఎవరో గద్దెనెక్కడం ఏమిటి అంటూ వారిలో ఆలోచన రేకెత్తించారు.

అయితే సైని ఇచ్చిన షాక్ కారణంగా బీజేపి కి బీసీలు ఈ సారి షాక్ ఇవ్వనున్నరనియా తెలుస్తోంది.

ఒక వేళ ఇదే జరిగితే హర్యానాలో బీజేపి దుకాణం సద్దేసుకోవడమే అంటున్నారు విశ్లేషకులు.అయితే ఇదే ప్లాన్ ఏపీలో వేసి టీడీపీ ని దెబ్బకొట్టాలని అనుకున్న బీజేపి కి చావు దెబ్బ తగిలింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube