అలా చేసినా రేప్ చేసినట్లే అంటూ మేఘాలయ కోర్టు సంచలన తీర్పు..

నేటి రోజుల్లో ప్రతి రోజూ వందల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి.చాలా అత్యాచారాలు బయటకు రావడం లేదు.

 Meghalaya Court Orders Sensational Verdict On Rape , Rape , Megalaya High Court-TeluguStop.com

కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏడాదికో, పదేళ్లకో అన్నట్లు ఇవి బయటకు వస్తున్నాయి.కొంత మంది అత్యాచారంతో పాటు హత్యలు కూడా చేస్తూ తమ కామ వాంఛను తీర్చుకుంటున్నారు.

ఇటువంటి నేరస్థుల ఆటలు కట్టించేందుకు ఇండియాలో చాలా కఠిన చట్టాలు వచ్చాయి.అయినా కానీ వీళ్ల నేరాలు మాత్రం తగ్గడం లేదు.

ఎన్ని చట్టాలు వచ్చినా నేరస్థులకు భయం మాత్రం వేయడం లేదు.దీని కారణంగా రోజూ చాలా మంది ఆడవాళ్లు తమ పవిత్రమైన శీలాలను కోల్పోతున్నారు.

ఇక అత్యాచారాల విషయంలో అప్పుడప్పుడు కోర్టులు చేసే వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతుంటాయి.తాజాగా మేఘాలయ హై కోర్టు కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం మేఘాలయ హై కోర్టు చేసిన వ్యాఖ్యలు వైరల్  అవుతున్నాయి.ఇంతకీ ఏం జరిగిందంటే.

మేఘాలయ రాష్ట్రంలో చాలా సంవత్సరాల క్రితం ఓ కామాంధుడు పదేళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు.ఈ చిన్న బాలిక ఎవరికి చెబుతుందిలే అని ఆ వ్యక్తి భావించనట్లు ఉన్నాడు.

కానీ ఆ పది సంవత్సరాల బాలిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి సదరు వ్యక్తిపై కంప్లైంట్ ఇచ్చింది.దీంతో కోర్టు ఈ కేసును విచారించి నిందితుడికి 2018లో రూ.25 వేల జరిమానా, పదేళ్ల జైలు శిక్షను విధించింది.అప్పుడు ఆ నిందితుడు కూడా తన తప్పును ఒప్పుకున్నాడు.

కానీ చాలా రోజుల తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ నిందితుడు మాట మార్చాడు.నేను ఆ నేరం చేయలేదని వాదిస్తూ.కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర హై కోర్టులో కేసు వేశాడు.కానీ ఆ నిందితుడు శిక్షార్హుడేనని రాష్ట్ర హై కోర్టు తీర్పు చెప్పింది.

మహిళ దుస్తుల మీది నుంచి తాకినా కూడా అది రేపే అవుతుందని తీర్పు చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube