Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఏపీ పాలిటిక్స్‌లో 2019 సినీ ' స్టార్స్ ' వీళ్లే-Film ‘Stars’ In AP Politics 2019 Elections

ఏపీలో 2019 రాజ‌కీయాలు రస‌వత్త‌రంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీల‌కు తోడుగా కొత్త‌గా పోటీకి రెడీ అవుతోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన‌తో ఇక్క‌డ ముక్కోణ‌పు పోటీ జ‌ర‌గ‌నుంది. ఇక కాంగ్రెస్‌, కామ్రేడ్లు కూడా త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాయి. ఇక ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలామంది స్టార్లు ప్ర‌త్య‌క్షంగానో లేదా ప‌రోక్షంగానో రంగంలోకి దిగుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం ఉండ‌గానే అప్పుడే ఏపీ ఎన్నిక‌ల‌కు సినీ శోభ సంత‌రించుకుంది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పార్టీ రాష్ట్ర‌వ్యాప్తంగా పోటీ చేయ‌నుంది. ప‌వ‌న్ స్వ‌యంగా అనంత‌పురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్నారు. ఇక ప‌వ‌న్ అన్న నాగ‌బాబు కాకినాడ నుంచి జ‌న‌సేన త‌ర‌పున ఎంపీగా పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.

ఇక వ‌రుణ్‌తేజ్ కూడా జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌నున్నాడ‌ట‌. ఇక ఇదే పార్టీ నుంచి హీరో శివాజీ గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌. ఇక జ‌న‌సేన నుంచే గుంటూరు లేదా రాజ‌మండ్రి అసెంబ్లీ బ‌రిలో ప్రముఖ హాస్య‌న‌టుడు ఆలీ పేరు వినిపిస్తోంది.

Continue Reading

Trending…

To Top