రేవంత్ జంపింగ్ తో ఇరకాటంలో చంద్రబాబు

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి ఇష్యూనే.రాహుల్ తో రేవంత్ భేటి అయ్యారు అన్న విషయం తెలిసిందే.

 Chandrababu In Tension With Revanth Reddy-TeluguStop.com

రేవంత్ పార్టీ మారబోతున్నారు అనే విషయం ఖరారు అయ్యింది కాకపొతే అధికారికంగా వెల్లడికాలేదు.అయితే తనపై వస్తున్న వార్తలకి రేవంత్ ఇంకా క్లారిటీగా సమాధానం చెప్పడం లేదు.

అయితే ఒక్క విషయంలో మటుకు రేవంత్ క్లారిటీ ఇచ్చారు.తాను పార్టీ మారకుండా ఉండాలంటే టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందా…? ఉండదా…? అనేది స్పష్టం చేయాలని చంద్రబాబును కోరారు.టీఆర్ఎస్ తో పొత్తు ఉన్నట్లయితే తన దారి తాను చూసుకుంటానని కుండబద్దలు కొట్టారు రేవంత్ రెడ్డి.

రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడదీసి ఏపీ ప్రజల ఆగ్రహానికి కారణమైన కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే తెలంగాణలో తెలుగుదేశం బ్రతకచ్చు ఏమో కానీ ఏపీలో టిడీపిని బొంద పెడుతారు అనేది వాస్తవం.

ఇప్పటికీ ఏపీ ప్రజలు కాంగ్రెస్ అంటే ఉగిపోతున్నారు.మధ్య మధ్యలో జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజల నుంచీ వస్తున్న స్పందన చూస్తుంటే ఎప్పటికీ కాంగ్రెస్ మీద కోపం తగ్గదు అనే భావన తెలిసిపోతుంది.

ఇప్పుడప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏపీలో కోలుకునే అవకాశం లేదు అందుకే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష భాద్యతలని ఎవరికైనా అప్పగించాలన్నా ఎవ్వరూ కూడా ముందుకు రావడం లేదు .ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ తో పొట్టు పెట్టుకునే అవకాశమే లేదు అంటున్నారు విశ్లేషకులు.

ఒకవేళ టీఆర్ఎస్ తో పొట్టు పెట్టుకున్నా సరే పరిస్థితిలో పెద్దగా మార్పు ఏమీ రాదు.తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ కానీ అన్నదమ్ములాంటి తెలుగు ప్రజలు విడిపోయి.

ఎంతో మంది ఉద్యోగులు.సొంత ఇళ్ళని ఆస్తులని అక్కడ అనాధలుగా వదిలేసి రావడానికి కారణం టిఆర్ఎస్.

అటువంటప్పుడు తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నా సరే ఏపీలో బాబు కి చాలా మైనస్ అవుతుంది.ఏపీ ప్రజలని కేసీఆర్ ఎన్ని ఇబ్బందులకి గురిచేశాడో ఇంకా ఎవ్వరు మర్చిపోలేదు.

ఏపీ వాళ్ళని తరిమి తరిమి కొట్టండి అని కేసీఆర్ అన్న మాటలు ఇప్పటికే ఏపీ ప్రజల గుండెల్లో మారుమోగుతూనే ఉన్నాయి.ఈ సమయంలో బాబు టిఆర్ఎస్ వైపు చూసినా అది టిడీపి చేసే పెద్ద తప్పు అవుతుంది.

పోనీ ఏపీ బిజేపితో పొత్తు పెట్టుకున్నట్టుగానే తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకుందామా అంటే తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందొ బిజెపి కూడా అలానే ఉంది…అయితే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కంటే టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితేనే రాజకీయంగా తెలంగాణలో టిడీపి కి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు ఆలోచన అని.అందుకే మంత్రులు కూడా కేసీఆర్ ఇక్కడకి వచ్చినప్పుడల్లా రాచ మర్యాదలు చేస్తూ ఉంటారు అని టాక్.ఏపీ ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో కేసీఆర్ మీద అభిమానం చూపడం చూస్తూనే ఉన్నాము.కేసీఆర్ ఏపీ కి వచ్చినప్పుడల్లా బ్యానర్లు కట్టడం…కనిపిస్తూనే ఉంటుంది.

ఏపీ లో కూడా కేసీఆర్ కి ఫాన్స్ ఉన్నారు.సో తెలంగాణలో టిడిపి కాంగ్రెస్ తో కంటే టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటేనే ఏపీ ప్రజల ఓట్ల మీద ప్రభావం లేకుండా ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏది ఏమైనా చంద్రబాబు ఈ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు అని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube