ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశంగా జింబాబ్వే( Zimbabwe ) తొలి స్థానంలో నిలిచింది.ఈ స్థానం అక్కడి ప్రజల పేదరికానికి, బాధలకు అద్దం పడుతోంది.
ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే( Steve Hanke ) వార్షిక మిజరీ ఇండెక్స్ ప్రకారం జింబాబ్వే ఈ విషయంలో తొలిస్థానంలో ఉండటం బాధాకరం.యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్, సిరియా, సూడాన్ వంటి దేశాల సరసన చేరింది జింబాబ్వే.
ద్రవ్యోల్భణం, పెరుగుతున్న నిత్యావసర రేట్లతో ఆ దేశ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.అక్కడ ద్రవ్యోల్భణం 243.8 శాతానికి చేరుకుంది.
మొత్తం ప్రపంచంలోని 157 దేశాలపై ఈ ర్యాకింగ్స్ ప్రకటించగా నిరుద్యోగం, ద్రవ్యోల్భనం, అధిక రుణరేట్లు, ప్రజల్లో రక్త హీనత విషయాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.జింబాబ్వేను ఇక్కడ చెప్పకున్న ఐదు అంశాలు దారుణంగా కుదిపేస్తున్నాయని తెలుస్తోంది.ఇక జింబాబ్వే తర్వాత 15 స్థానాల్లో వరసగా వెనిజులా, లెబనాన్, సిరియా, సూడాన్, యెమెన్, ఉక్రెయిన్, అర్జెంటీనా, క్యూబా, టర్కీ, హైతీ, శ్రీలంక, అంగోలా, టోంగా, ఘనా దేశాలు ఉన్నాయి.
ఈ ఇండెక్స్ ప్రకారం యూరప్ దేశం స్విట్జర్లాండ్( Switzerland ) అత్యంత మెరుగైన స్థితిలో ఉన్నట్టు సమాచారం.
ఇక రెండో సంతోషకరమైన దేశాల లిస్టులో కువైట్ వుంది.ఆ తరువాత స్థానాల్లో ఐర్లాండ్, మలేషియా, జపాన్, తైవాన్, థాయిలాండ్, నైజర్, టోగో, మాల్టా దేశాలు ఉన్నాయి.ఈ జాబితాలో ఇండియా 103వ స్థానంలో( India ) ఉండడం కొసమెరుపు.
ఇండియా ర్యాంకుకు కారణం నిరుద్యోగం అని తెలుస్తోంది.ఇక అమెరికా ఈ జాబితాలో 134వ స్థానంలో ఉండగా వరల్డ్ హ్యపీనెస్ రిపోర్ట్ లో వరసగా ఆరేళ్లుగా ప్రపంచంలో తొలిస్థానంలో ఉన్న ఫిన్లాండ్ ఇపుడు 109వ స్థానంతో సరిపెట్టుకుంది.