పవన్ , బాబు పొత్తుపై జగన్ ఇచ్చిన క్లారిటీ ఇదే..???  

Ys Jagan On Pawan Kalyan And Chandrababu Tie Up-janasena,kalyan And Chandrababu Tie Up,pawan Kalyan,pawan Kalyan Janasena,tdp,ycp,ys Jagan

2019 ఎన్నికలు ఏపీలో పెను సంచలనం సృష్టించడం ఖాయం. ఎందుకంటే ఏపీలో ఎన్నడూ లేనట్లుగా త్రిముఖ పోరు జరగడం.ఆపోరు కూడా కులరాజకీయాల ఆధారంగా జరగనుండటంతో ఈ ఎన్నికలపై నేతల్లో, ప్రజలలో ఎంతో ఆసక్తి నెలకొంది..

పవన్ , బాబు పొత్తుపై జగన్ ఇచ్చిన క్లారిటీ ఇదే..???-YS Jagan On Pawan Kalyan And Chandrababu Tie Up

వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగానే పోటీ చేస్తాడు కాని అధికారంలోకి రాలేడు కాని తన సామాజిక వర్గ ఓట్లు భారీ స్థాయిలో చీల్చుతాడు అనే విషయం తెలిసిందే. ఇక ఎలాగో చంద్రబాబు ని ఈ సారి ఏపీ ప్రజలు నమ్మే పరిస్తితిలేదు…కాని.

తన సొంత సామాజిక వర్గం సైతం బాబు కోసం పని చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక జగన్ విషయంలోకి వస్తే అన్ని వర్గాలని తన పాదయాత్రతో కలుపుకుని పోతూ అందరివాడు అయ్యాడు.

కాని ఓట్ల చీలిక జగన్ కి ఎలా కలిసి వస్తుంది పవన్ ప్రభావం ఎలా ఉండబోతోంది అనే వివరాలని జగన్ తనదైన శైలిలో విశ్లేషించారు. ఇంతకీ ఆ విశ్లేషణలో పవన్ ప్రభావం ఎపీపై ఎంత అనే విషయంలో ఓ క్లారిటీ ఇచ్చారు జగన్..

వైసీపీ అధినేత మొదటి సారిగా ఏపీ ఎన్నికల్లో పవన్ ప్రభావంపై స్పష్టత ఇచ్చారు.

జగన్ ఇచ్చిన క్లారిటీ అందరికి ఆమోద యోగ్యంగా ఉండనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీలకు పవన్ ప్రచారం చేశారు, ఈ సారి విడిపోయినట్లు నటిస్తూ ప్రచారం బాబు తో పవన్ అంటకాగే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు చంద్రబాబు మాతో కలిసి పని చేయండి అంటూ పవన్ ని అడుగుతున్నట్టుగా నాటకాలు ఆడుతున్నారని అన్నారు.

పవన్ ,బాబు తో కలిసి పని చేసినప్పుడు పవన్ అభిమానుల ఓట్లు బాబు కి పడ్డాయి. కాని ఇప్పుడు పవన్ ఓటరిగా ఓటీ చేస్తే ఆ ఓట్లు పవన్ కి పడతాయి తప్ప పెద్దగా ప్రయోజనం లేదని అన్నారు అంతేకాదు ఒక వేళ పవన్, బాబు లు మళ్ళీ కలిసి పోటీ గనుకా చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకే పడతాయని ధీమా వ్యక్తం చేశారు. సో జనసేన పోటీ వల్ల తమకి ఎలాంటి నష్టం లేదని. మా ఓటు బ్యాంక్ మాదగ్గరే ఉందని జగన్ విశ్లేషించారు.