2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో విజయం సాధించింది.151 సీట్లు దక్కించుకుని టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది.తాజాగా ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్న ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇందులో భాగంగానే పార్టీలోని సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు.
మౌనం దాల్చిన ఆ మాజీ మంత్రి :
వైసీపీలో మాటల మాంత్రికుడుగా, ప్రత్యర్థులపై రాజకీయ ఘాటైన సెటైర్లు వేసే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ప్రస్తుతం మౌనం దాల్చాడు.ఆయన కనిపించడం లేదు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నిత్యం మీడియాలో ప్రత్యర్థులను తికమకపెట్టే పార్థసారథి నోరు ప్రస్తుతం మూగబోయింది.గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి మంత్రి పదవి ఆశించారు.
జగన్ అవకాశం ఇవ్వలేదు.కొన్నాళ్ళు బాగానే ఉన్న పార్థసారథి ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు.
పార్టీ నాయకులతో కలివిడిగా ఉండకుండా, పార్టీకి అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు.జగన్ ఆదేశాల మేరకు గడప గడప కార్యక్రమాన్ని మొక్కుబడిగా చేసిన పార్థసారథి వైసిపి కార్యక్రమాలపై, వైసీపీ నాయకుల పై మనస్సు పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆయన మౌనానికి కారణం పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని పార్థసారథి మదన పడుతున్నాడట.తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకపోగా ప్రజలకు సంబంధించిన సమస్యలు కూడా తన పరిష్కరించలేక పోతున్నానని అనుచరులతో కలిసి చెబుతున్నాడట.పార్టీకి గతంలో ఉన్న ఇమేజ్ ప్రస్తుతం తగ్గిందన్న వాదన కూడా ఆయన నుండి వినిపిస్తుందట.ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి దూరంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రాజకీయాలలో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కావడం లేదు.ఈ నేపథ్యంలో పార్థసారథి పక్క పార్టీల వైపు చూస్తున్నాడా అన్న వాదన కూడా తెరమీదికి వచ్చింది.
ఈ విషయంలో వైసీపీ అధిష్టానం స్పందించింది జిల్లాకు చెందిన సీనియర్ నాయకుని బుజ్జగించే ఈ కార్యక్రమానికి పంపినట్లు సమాచారం.అయినప్పటికీ పార్థసారథి లో ఎలాంటి మార్పు రావడం లేదని సమాచారం.
మరి పార్థసారథి పార్టీ మారతాడా.? బుజ్జగించడం వల్ల వైసీపీలో పూర్వ వైభవంతో తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడా…? అనేది ప్రశ్నార్థకంగా మారింది
.