‘యాత్ర 2’ మూవీ టీజర్ వచ్చేస్తోంది.. దుమ్ము రేపుతున్న పోస్టర్..!

దివంగత నేత వైఎస్ఆర్ జీవితం ఆధారంగా వచ్చిన ‘యాత్ర’( yatra ) సినిమాకి సీక్వెల్ గా ‘యాత్ర -2’( Yatra-2 ) తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 'yatra 2' Movie Teaser Is Coming The Poster Is Making Dust , Yatra-2, Yatra, Ys-TeluguStop.com

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి( Mammootty ) , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా( Jiva ) నటిస్తున్న ఈ చిత్రానికి మహి వి.రాఘవ్ దర్శకత్వం వహించారు.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా నేతగా ఎదిగిన తీరుతో పాటు 2009 నుంచి 2019 సంవత్సరం వరకు ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఫిబ్రవరి 8 న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈనెల 5న మూవీ టీజర్ ను విడుదల చేయబోతుంది చిత్ర యూనిట్.విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు.ఇందులో భాగంగా ఇప్పటికే హీరో జీవాతో భారతీ పాత్ర పోషిస్తున్న నటి కేతకి నారాయణన్ ( Actress Kethaki Narayanan )లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

టీజర్ ను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసిన మూవీ టీం మమ్ముట్టి, జీవా కలిసి ఉన్న కొత్త పోస్టర్ ను రివీల్ చేసింది.దీనిపై సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

తండ్రి వెనుక నిలబడ్డ తనయుడిగా ఉన్న జీవా అచ్చం వైఎస్ జగన్ లానే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అలాగే నేను ఎవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు.కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకును.’ అని పోస్టర్ పై రాసి ఉండటం మరింత ఉత్కంఠను కలిగిస్తుందని తెలుస్తోంది.ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ చిత్రం కోసం వైఎస్ఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube