Samantha Shakunthalam : శాకుంతలం సమంత ఆ హోప్ వచ్చేలా చేసింది..!

సమంత ప్రధాన పాత్రలో నడిచిన యశోద మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు.

 Yashoda Helps For Samantha Shakunthalam,samantha,yashoda,shakunthalam,gunasekhar-TeluguStop.com

బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మాండమైన వసూళ్లు రాబడుతుంది.మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 8 కోట్లు రాబట్టింది.

ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి.లాభాల బాటపట్టింది.

యశోద హిట్ అవ్వడంతో శాకుంతలం ఫై అందరిలో అంచనాలు పెరిగేలా చేసింది.

దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న శాకుంతలం కు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సమంత, మోహన్ బాబు, దేవ్ మోహన్ , అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.మ‌హాభార‌త ఇతిహాసంలో అద్భుత‌మైన ప్రేమ ఘ‌ట్టంగా చెప్పుకుంటూ ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం.

దీన్ని ఆధారంగా చేసుకుని.శాకుంతలం చిత్రాన్ని గుణ శేఖ‌ర్‌ తెరకెక్కిస్తున్నారు.

శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్రణ‌య‌గాథ ఇది.శకుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు. నవంబర్ 4న రిలీజ్ అనుకున్న ఈ మూవీ ఆ డేట్ నుంచి వాయిదా పడ్డది.కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా చెప్పలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube