కరోనా వైరస్ విజృంభణ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి కరోనా వైరస్ ని నియంత్రిచేందుకు లాక్ డౌన్ అమలు చేశారు.
అయితే ఈ లాక్ డౌన్ లో ఎంతోమంది ప్రజలు బయటకు అడుగు పెట్టాలి అంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు.ఇంకా అలాంటి సమయంలోను ప్రజల కోసం నిత్యావసర సరుకులు, ఆహారాన్ని అందించడానికి డెలివరీ బాయ్స్ నిరంతరం కష్టపడుతున్నారు.
ఇంకా ఈ డెలివరి బాయ్స్ కష్టాన్ని గుర్తించిన జనాలు వారిపై ప్రేమను చూపిస్తన్నారు.అయితే మొట్టమొదటిసారి కరోనా పుట్టిన నగరం అయినా వూహాన్ లో ఓ డెలివరీ బాయ్ కు ఓ వింత అనుభవం ఎదురైంది.
అసలు ఏమైంది అంటే? గత నెల 15న అతనికి వచ్చిన ఆర్డర్ లను చూసుకుని వాటిని డెలివరీ చేస్తున్నాడు.
అందులో భాగంగానే రాత్రి వచ్చిన కేక్ ఆర్డర్ తీసుకునేందుకు బేకరీకి వెళ్లగా షాపులో పనిచేసే వ్యక్తి అది అతనికే వచ్చింది అని చెప్పాడు.దీంతో అతను షాక్ అయ్యి పొరపాటుపడుతున్న.అది నాకు వచ్చింది కాదు ఒకసారి చూసుకొని అని చెప్పగా అతను మళ్లీ డెలివరీ బాయ్ పేరే చెప్పాడు.
అతనికి అప్పుడు గుర్తువచ్చింది.ఆ కేక్ వచ్చింది అతనికే అని.ఆరోజు అతని పుట్టినరోజు అని.కన్నీళ్లు ఆపుకుంటూ.కేక్ తీసుకుని బేకరీ బయట వెళ్లి కూర్చున్నాడు.
కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ కేక్ ఎంతో ఇష్టంగా తిన్నాడు.ఇది అంత అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా.
ఒక్కరోజులో వైరల్ గా మారింది.అయితే ఆ కేక్ ఎవరు డెలివరీ బాయ్ పేరు మీద పెట్టారు అనేది మాత్రం తెలియలేదు.