బ్యాంకు ద్వారం అద్దాల తలుపును ఢీకొట్టుకొన్న మహిళ.! చివరకు..?

మరణం ఎవరికీ ఎటువైపు నుంచి ఏ క్షణంలో వస్తుందో చెప్పలేము.అప్పటివరకు మనతో పాటు కలియతిరిగి ఆనందంగా ఉన్న వ్యక్తి మరుక్షణంలో ప్రాణాలు వదిలిన సంఘటనలు కూడా చాలానే చూశాం ఇంతవరకు.

 Woman, Hit, Mirror Door , Bank Door, Finally,kerala,ernakulam,bank-TeluguStop.com

ఇలాంటి సంఘటనలు రోజుకు ప్రపంచంలో ఏదో ఒక మూలన జరుగుతూనే ఉంటాయి.

ఇకఅసలు విషయంలోకి వెళితే… కేరళలోని ఓ మహిళ పనిమీద బ్యాంకు దగ్గరికి వెళ్ళింది.

అయితే అక్కడ ఆ మహిళ అద్దాల తలుపును ఢీకొని చనిపోయింది.ఆ సన్నివేశాలన్నీ బ్యాంకు సీసీటీవీలో పూర్తిగా నమోదయ్యాయి.

ఇకపోతే ఈ సంఘటన కేరళలోని ఎర్నాకుళం వద్ద ఉన్న పెరంబూరు చెందిన ఓ మహిళ కు జరిగింది.ఆ మహిళ తన స్కూటర్ కి తాళం వేయలేదన్న సంగతి గుర్తుకు రావడంతో కంగారుగా బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది.

ఇక ఆ తొందరలో ఆమె అద్దాల డోర్ మూసి ఉన్న సంగతి గమనించక పోవడంతో ఆమె తలుపుని ఢీ కొట్టగానే వెంటనే ఆ అద్దాలు పగిలిపోయాయి.అలా పగిలిపోయిన అద్దాల డోర్ నుండి ఒక పదునైన అద్దం ముక్క ఒకటి ఆమె కడుపు లోకి గుచ్చుకుంది.

దింతో ఆ బ్యాంకులోని అధికారులు హుటాహుటిన ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినా ఫలితం కనపడలేదు.ఆమె చికిత్స పొందుతూ హాస్పిటల్లో మరణించడం జరిగింది.దీనితో ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube