వాట్సాప్ గ్రూపులతో వేగలేకపోతున్నారా..? మీ కోసమే కొత్త ఆప్షన్ రాబోతోంది

ఇప్పుడు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందరికి అందుబాటులో ఉండడం వల్ల వాట్సాప్ వాడే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యింది.

 Without Your Permission You Can Not Add To Whatsapp Group-TeluguStop.com

అయితే వాట్సప్ వాడేవారికి పెద్ద చిక్కు ఏదైనా ఉందా అంటే… అది గ్రూపుల గోల.ఇప్పుడు ఎవరికి వారు ఏదో ఒక పేరుతో గ్రూప్ క్రియేట్ చేయడం ఆ గ్రూప్ లో ఇష్టానుసారంగా …ఒక దానికి సంబంధం లేకుండా ఎవరికి వారు ఎదో ఒకటి పంపుతూ గందరగోళానికి గురిచేయడం ఇప్పటివరకు జరుగుతూ వస్తోంది.దీని కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు.వాట్సాప్ గ్రూపు లో ఉండలేక లెఫ్ట్ అవ్వలేక సతమతం అయిపోతున్నారు .అలాంటి వారికోసం వాట్సాప్ ఇప్పుడు ఓ కొత్త ఆప్షను డెవలప్ చేసిన చేసే పనిలో పడింది.

ఈ ఆప్షన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది.ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే… వాట్సాప్ గ్రూప్ లో ఎవరైనా మిమ్మల్ని యాడ్ చేయాలంటే… ఇష్టం వచ్చినట్టు యాడ్ చేయడం కుదరదు.తప్పనిసరిగా మీ పర్మిషన్ ఉండాల్సిందే.

ఇష్టం లేకుండా ఎవరూ ఏ గ్రూపులో యాడ్ చేయడానికి కుదరదు.దీనికి చేయాల్సిందల్లా వాట్సాప్ లో ఉన్న సెట్టింగ్ లో కొన్ని ఆప్షన్స్ మార్చుకోవడమే .అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు కానీ తొందరలోనే అందుబాటులోకి రాబోతున్నట్టు వాట్సాప్ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube