రేవంత్‌ను త‌ప్పిస్తారా.. సీనియ‌ర్ల ప్ర‌తిపాద‌న‌లు నిజ‌మేనా..?

ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్ రాజ‌కీయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.ఎందుకంటే ఈ పార్టీ లో ఉన్న వారంతా బ‌య‌టి పార్టీ నేత‌ల‌ను విమ‌ర్శించ‌డం కంటే కూడా సొంత పార్టీ నేత‌ల‌ను ఎక్కువ‌గా విమ‌ర్శించ‌డం క‌నిపిస్తోంది.

 Will Revanth Escape . Are The Seniors' Proposals True ..?, Revanth, Congress, Ts-TeluguStop.com

ముఖ్యంగా రేవంత్ దూకుడు సీనియ‌ర్ల‌కు అస్స‌లు మింగుడు ప‌డ‌టం లేదు.త‌మ‌కేది చెప్ప‌కుండానే నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడ‌నే వాద‌న వారి నుంచి బ‌లంగా వినిపిస్తోంది.

ఇదే ఇప్పుడు రేవంత్ కు పెద్ద చిక్కులు తెచ్చిపెడుతోంది.ఎవ‌రినీ లెక్క చేయ‌కుండా సొంతంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే రేవంత్‌కు పెద్ద స‌మ‌స్య‌లు తెస్తోంది.

మొన్న‌టికి మొన్న జ‌గ్గారెడ్డి ఏకంగా సోనియా గాంధీకి లేఖ రాయ‌డం కూడా ఇందులోకి వ‌స్తోంది.ఆయ‌న రేవంత్ రెడ్డి తీరు మార్చాలంటూ సోనియా గాంధీకి లేఖ రాయ‌డం, దాన్ని మీడియా ముందు పెట్ట‌డం ఇలాంటిదే.

అయితే ఇలా మూకుమ్మ‌డిగా అంద‌రూ తీవ్రంగా వ్య‌తిరికించ‌డంతో ఢిల్లీ నాయ‌క‌త్వం కూడా అలెర్ట్ అయిపోయింది.ఇన్ని రోజులు మారుతారేమో అని ఎదురు కూసింది.కానీ అంద‌రూ ఇంకా వ్య‌తిరేకించ‌డంతో రేవంత్‌ను మార్చేందుకు డిసైడ్ అయిన‌ట్టు వార్త‌లు రావ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.కాగా సీనియ‌ర్ల నుంచి వ‌స్తున్న ప్ర‌తిపాద‌న‌ల‌ను మాణికం ఠాగూర్ అడ్డుకుంటున్నారంట‌.

Telugu Congress, Jagga, Manikaya Takoor, Rahul Ghandi, Revanth, Senior, Sonia Gh

ఎందుకంటే రేవంత్ ప‌గ్గాలు తీసుకున్న త‌ర్వాత పార్టీ మ‌ళ్లీ పుంజుకుంటోంద‌ని ఆయ‌న ఢిల్లీ నాయ‌క‌త్వానికి చెబుతున్నారు.పోరాట ప‌ఠిమ ఉన్న నాయ‌కుడు కాబ‌ట్టి రేవంత్‌కు ఇవ్వ‌డం స‌బ‌బే అని చెబుతున్నారంట‌.ఇప్ప‌టికే రేవంత్ ధర్నాలు, దీక్షలు అంటూ హోరెత్తిస్తున్నారు.ఇక ఈ ఏడాదిలోనే పాద‌యాత్ర కూడా చేయాల‌ని భావిస్తున్నారంట‌.కానీ సీనియ‌ర్లు మాత్రం ఆయ‌న తీరును ఏ మాత్రం అంగీక‌రించ‌ట్లేదు.ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారంటూ విమ‌ర్శిస్తున్నారు.

రేవంత్ ను మార్చాల్సిందే అంటూ గ‌ట్టిగా నిన‌దిస్తున్నారు.మ‌రి ఢిల్లీ నాయ‌క‌త్వం ఈ ప్ర‌తిపాద‌న‌ల మీద ఏమైనా స్పందిస్తుందా లేదా అన్న‌ది మాత్రం చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube