టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )తో సక్సెస్ సాధించినా త్రివిక్రమ్ రేంజ్ హిట్ దక్కలేదనే సంగతి తెలిసిందే.గుంటూరు కారం అబవ్ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా కొన్ని ఏరియాలలో ఈ సినిమాకు నష్టాలు తప్పలేదు.
అయితే ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చే విషయంలో ముందువరసలో ఉండే ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మరో ఛాన్స్ ఇస్తారా? అనే ప్రచారం జరుగుతోంది.వాస్తవానికి ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్న సమయంలో తారక్ త్రివిక్రమ్ కు ఛాన్స్ ఇవ్వగా అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్ ప్రూవ్ చేసుకున్నారు.
ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కిన బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.ఈ సినిమా భారీ స్థాయిలో లాభాలను అందించిందని సితార నిర్మాత నాగవంశీ చాలా సందర్భాల్లో వెల్లడించారు.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో( NTR Prashanth Neel ) మూవీ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఈ కాంబినేషన్ లో సినిమా గురించి చర్చ జరుగుతోంది.
త్రివిక్రమ్ బన్నీ కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా ఆ సినిమా వేర్వేరు కారణాల వల్ల ఆలస్యంగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ త్రివిక్రమ్( NTR Trivikram ) ను మరోసారి ఆదుకుంటారో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.త్రివిక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ లు సైతం ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా హారిక హాసిని బ్యానర్ పైనే ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ సైతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.