కాజల్ సొంత బిజినెస్ సక్సెస్ అవుతుందా?

లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకొని గత దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా కొనసాగుతున్నారు.

 Will Kajal Aggarwal Got Success As A Producer Details,  Kajal Aggarwal, Tollywoo-TeluguStop.com

ఈమె కేవలం దక్షిణాది చిత్రాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ చిత్రాలలో కూడా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా కెరీర్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గత ఏడాది తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం దూరం కాకుండా వరుస అవకాశాలను అందుకుని ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించారు.ఈమె మరొక నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కలుపుకొని సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ నిర్మాణ సంస్థలో భాగంగా “మను చరిత్ర” అనే సినిమాను తెరకెక్కించారు.ఇందులో శివ కందుకూరి హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాకు రాజ్ కందుకూరి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

Telugu Acharya, Raj Kandukuri, Ghost, Shiva Kandukuri, Megha Akash, Kajal Aggarw

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ మొట్టమొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుంది ఈ బిజినెస్ లో కాజల్ సక్సెస్ అవుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.ప్రస్తుతం ఈమె మెగాస్టార్ సరసన ఆచార్య సినిమాలో నటించారు.

అలాగే నాగార్జున హీరోగా ఘోస్ట్ అనే చిత్రంలో కూడా నటించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube