వై నాట్ 175 అనే నినాదం వినిపిస్తున్న వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆ టార్గెట్ ను చేరుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు.2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను దాదాపు అమలు చేసాము అని, మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా ప్రవేశపెట్టి జనాలకు మేలు భారీగా లబ్ధి చేకూర్చాము అని చెబుతున్న వైసిపి ( YCP )మళ్లీ ప్రజలు తమకు పట్టం కడతారనే నమ్మకంతో ఉంది.అందుకే 175 నియోజకవర్గాల్లోనూ వైసిపి జెండా ఎగరవేసే విధంగా టార్గెట్ పెట్టుకుంది.దీనికి అనుగుణంగా నే కార్యక్రమాలు చేపట్టారు.ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అన్ని గ్రామ , వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటికి స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్చార్జీలు వెళ్లే విధంగా కార్యక్రమాన్ని ప్రారంభించి అనుకున్న మేరకు సక్సెస్ చేశారు.దీని ద్వారా వైసిపి నాయకులు జనానికి మరింత దగ్గరయ్యారని ఆ పార్టీ అంచనా వేస్తుంది.
గడపగడపకు మన ప్రభుత్వంలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు ఆధారంగా స్థానిక నాయకుల పనితీరు పైన ఒక క్లారిటీకి వచ్చారు.పనితీరు సక్రమంగా లేని వారిని మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.వచ్చే మూడు నెలలకు సంబంధించిన కార్యక్రమాలను జగన్ ప్రకటించారు . జగనన్న ఆరోగ్య సురక్ష, సామాజిక సాధికార యాత్రలు, ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలతో పార్టీ కేడర్ ను ప్రజల్లో ఉండేలా ఒక కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం జగనన్న సురక్ష కార్యక్రమం( Jagannana Suraksha programme ) ద్వారా రాష్ట్రంలో ఉన్న కోటి 60 లక్షల కుటుంబాల ప్రజలకు వైద్య పరీక్షలు, ఆరోగ్య శ్రీ ద్వార చికిత్సలు అందిస్తున్నారు.అలాగే అక్టోబర్ 26 నుంచి సామాజిక సాధికార బస్సు యాత్రలు కూడా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమాలపై నేడు ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు.ఇప్పటికే వైసిపి చేపడుతున్న అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో పాటు పరిశీలకులు ఉన్నారు.
తాజాగా ప్రతి నియోజకవర్గానికి ఒక సీనియర్ నేతను నియమిస్తున్నట్లు సమాచారం .కొత్తగా నియమించి వారికి ప్రత్యేక బాధ్యతలు జగన్ అప్పగించ బోతున్నారట. ముఖ్యంగా కొత్త ఓటర్ల పై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా కొత్తగా నియమించే వారికి బాధ్యతలు అప్పగించబోతున్నారట.స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్చార్జి గా ఉన్నవారు సిఫార్సు మేరకు వారికి ప్రాధాన్యత ఇచ్చి నియామకం చేపట్టనున్నారు.
ఆ పరిశీలకులు ఇచ్చే నివేదికలతో పాటు , పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం చేసే విధంగా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.నియోజకవర్గ పోలింగ్ బూత్ పరిధిలో తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తిరుగు లేకుండా చేసుకునే విధంగా జగన్ సరికొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.