ఈ మధ్య కాలంలో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఒకే ఫ్రేమ్ లో కనిపించిన సందర్భాలు దాదాపుగా లేవనే సంగతి తెలిసిందే.చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో( AIG Hospital ) చికిత్స పొందుతున్నారు.రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు.
వైద్యుల సూచనల మేరకు చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) గురువారం సాయంత్రం ఆస్పత్రిలో చేరారు.అయితే చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ గా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ స్పందించలేదు.
అయితే తారక్ చంద్రబాబును కలవబోతున్నారని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతు ఇస్తే మాత్రం పొలిటికల్ లెక్కలు మారడం గ్యారంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమా షూట్ సమయంలో తన మద్దతు టీడీపీకే ( TDP )ఎప్పటికీ ఉంటుందని వెల్లడించారు.అయితే మారిన పొలిటికల్ లెక్కల ప్రకారం రాజకీయాలకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తెలివిగా తీసుకుంటారని మరి కొందరు చెబుతున్నారు.

ప్రస్తుతం సినిమాలకే తారక్ పూర్తిస్థాయిలో పరిమితం కావడంతో వరుణ్ లావణ్యల పెళ్లికి సైతం తారక్ హాజరు కాలేదు.పెళ్లికి హాజరు కాని ఈ నందమూరి హీరో రిసెప్షన్ కు మాత్రం హాజరు కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా 2024 సమ్మర్ లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది.ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.







