అన్నపూర్ణమ్మ. 1975 లో మోహన్ బాబు సరసన హీరోయిన్ గా స్వర్గం నరకం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి 200 ల సినిమాల్లో నటించింది.హీరోయిన్ గా కంటిన్యూ అవ్వలేకపోయిన తెలుగు తో పాటు తమిళ్, మలయాళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది.
ఇక అన్నపూర్ణమ్మ ఎక్కువగా తల్లి పాత్రల్లో నటించింది.ఆ తర్వాత బామ్మా గా, అమ్మమ్మ గా నటిస్తూ చివరగా తెలుగు లో సీత రామం సినిమాలో కనిపించింది.
చిన్న పాత్రా అయినా పెద్ద పాత్రా అయినా తేడా లేకుండా ఎవరి సినిమాలో అయినా నటిస్తుంది.పైగా దాదాపు 50 ఏళ్ళ కెరీర్ లో ఏనాడూ పెద్దగా వివాదాల జోలికి పోలేదు.
ఇక సినిమాలే కాకుండా జబర్దస్త్ వంటి రియాలిటీ షోలలో కూడా కామెడీ చేస్తూ అలరిస్తుంది.
వాస్తవానికి జబర్దస్త్ షో లో భూతు పదాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే వల్గారిటీ కూడా శృతి మించి పోతుందని అంటూ ఉన్నారు.
అన్నపూర్ణమ్మ సైతం జబర్దస్త్ షో లో భూతు ను బాగానే ఒంట పట్టించుకున్నారు.పూర్తి స్థాయి డబల్ మీనింగ్ డైలాగ్స్ తో రామ్ ప్రసాద్ టీమ్ లో ఫుల్ టైం మెంబర్ గా కొనసాగుతుంది.
ఇక వీరి టీమ్ లో మరింత ఎక్కువ గా ఈ డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.పైగా ఈ వయసులో అన్నపూర్ణమ్మ చెప్పే ఆ డైలాగ్స్ వినడానికి చాలా కంపరంగా ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో బాగా వినిపిస్తుంది.
ఆమెను ఒకప్పుడు అమ్మ పాత్రల్లో చూసి ఇప్పుడు డబ్బులు వస్తే ఎలాంటి కామెడీ అయినా చేయడానికి ఆమె సిద్దపడటం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి ఒక షో లో పాల్గొని ఆమె పరువును ఆమె పోగొట్టుకుంటున్నారని అని కూడా అంటున్నారు, అసలు ఆమె అలాంటి ఎబ్బెట్టు డైలాగ్స్ చెప్పడానికి ఎలా ఒప్పుకుంటున్నారని, ఆమె చేత అలాంటి డైలాగ్స్ చెప్పేస్తున్నా రామ్ ప్రసాద్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు.ఇక ఇది జబర్దస్త్ వాడి స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది కాబట్టి కనీసం వాళ్ళైనా అంత పెద్ద ఆర్టిస్ట్ తో అలాంటి మాటలు చెప్పించకపోతే ఏంటి అంటూ అడుగుతున్నారు.