రేవంత్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ ( Rahul Gandhi )మరియు ప్రియాంక గాంధీ వెనకాల కూర్చున్న ఈ అందమైన మహిళ చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించింది.రాహుల్, ప్రియాంక పై కెమెరా ఫోకస్ చేసిన ప్రతిసారి ఆమె వెనకాల నవ్వుతూ కూర్చున్న ఈ అందమైన మహిళ ఎవరు అంటూ చాలామంది సోషల్ మీడియాలో చర్చ సాగించారు.
ఆమె మరెవరు కాదు పేరు ప్రణతి షిండే( Pranathi Shinde ).నాటి తెలుగు రాష్ట్ర గవర్నర్ సుశీల్ కుమార్ షిండే ( Governor Sushil Kumar Shinde )కుమార్తె.కాబట్టి ఆయన గురించి చాలా మందికి తెలుసు.ప్రస్తుతం మహారాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా ఆమె మన రేవంత్ ప్రమాణ స్వీకారానికి అయింది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు ఆహ్వానం అందడంతో ఈ మహోత్సవానికి హాజరయ్యింది.
మన దేశంలో ఉన్న అందమైన మహిళలు రాజకీయవేత్తల్లో ప్రగతి షిండే ముందు వరుసలో ఉంటారు.అయితే ఈమె మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సోలాపూర్ నియోజకవర్గ ( Solapur Constituency )నుంచి పని చేస్తున్నారు.అక్కడ తెలుగు వారు చాలామంది ఉంటారు అందుకే కేసిఆర్ తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ మని మార్చగానే మొట్టమొదటిసారిగా ఆయన కన్ను సొలాపూర్ పైననే పడింది.
మజిలీస్ పార్టీ బలం కూడా అక్కడ చాలా ఎక్కువ.వారికి తెలంగాణ లో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న రాష్టేతర స్థానం కూడా సోలాపూర్ కావడం విశేషం.
ఇప్పటికే రెండుసార్లు ఆమె ఎమ్మెల్యేగా మజిలీస్ పార్టీ నాయకుల పైనే పోటీ చేసి గెలిచింది.వచ్చే ఎన్నికల్లో సభ స్థానానికి అక్కడి నుంచి పోటీ పడబోతోంది.అక్కడ తెలుగు వాళ్ళ బలం చాలా ఎక్కువ కాబట్టి ఆమెకు మనకు అనేక లింకులు ఉన్నాయి.సుశీల్ కుమార్ షిండే రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రణతి తన తండ్రి రాజకీయ పగ్గాలను అందుకొని చాలా చక్కగా ముందుకు దూసుకుపోతుంది ప్రస్తుతం ఆమె వయస్సు 43 ఏళ్లు.
నేషనల్ స్క్రీన్ పై ప్రణతిని చూసిన చాలామంది ఆమె గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు.