Re-Release Movies Collections : తెలుగు లో రీ రిలీజ్ సినిమాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టిన స్టార్ హీరో ఎవరంటే..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ లా హవా నడుస్తుంది.అయితే కొన్ని సినిమాలు మొదటిసారి రిలీజ్ చేసినప్పుడు పెద్దగా సక్సెస్ సాధించడం లేదు.

 Who Is The Star Hero Who Got Huge Collections In Telugu Re Release Movies-TeluguStop.com

కానీ రీ రిలీజ్ చేసినప్పుడు మాత్రం భారీ సక్సెస్ లను సాధిస్తున్నాయి.ఇక గత నెలలో వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఓయ్ సినిమాకి( Oye Movie ) ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అయితే వచ్చింది.

మొదటిసారి రీ రిలీజ్ చేసినప్పుడు పెద్దగా సక్సెస్ దక్కకపోయిన కూడా ఇప్పుడు ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులందరూ ఇంట్రెస్ట్ చూపించారు.

ఇక అందులో భాగంగానే ఈ సినిమా రీ రిలీజ్ లో సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి… ఇక ఇది ఇలా ఉంటే ఎంత మంది హీరోల సినిమాలు రీ రిలీజ్ అయిన కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి ఉన్న రేంజ్ మరొక హీరోకి ఉండదనే చెప్పాలి.ఇక అందుకే గత సంవత్సరం నుంచి రీ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఖుషి సినిమా( Kushi Movie ) భారీ కలెక్షన్స్ ను వసూలు చేసి నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక ఖుషి సినిమా రీ రిలీజ్ లో 12 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి రీ రిలీజ్ లో కూడా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది.

అందుకే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాని బీట్ చేయడం ఇప్పుడున్న హీరోలా వల్ల కాదు అనేది మరొకసారి ప్రూవ్ అయింది.

ఇక రీసెంట్ గా రామ్ చరణ్( Ram Charan ) హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా( Orange Movie ) కూడా రీ రిలీజ్ అయింది.ఈ సినిమా దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.మిగతా హీరోల సినిమాలు ఏవి కూడా అంత పెద్దగా కలెక్షన్స్ అయితే రాబట్టే లేకపోతున్నాయి.

ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమాను రీ రిలీజ్ చేసినా కూడా ఒకటికి పది సార్లు చూస్తూ ఆ సినిమాను సూపర్ హిట్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube