కేరళ శబరిమల అయ్యప్ప స్వామిని వద్దు వద్దు అంటూ భక్తులు ఎంత వారించినా కూడా వినకుండా దర్శించుకున్న బింధు మరియు కనకదుర్గలు గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు.వారు అయ్యప్పను దర్శించుకున్న తర్వాత పోలీసులు వారిని ఎక్కడికి తీసుకు వెళ్లారు, వారు ఎక్కడ ఉన్నారనే విషయం ఏ ఒక్కరు చెప్పడం లేదు.
ప్రభుత్వంకు ఆ విషయం తెలిసి ఉండవచ్చు.కాని ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు.
వారి కుటుంబ సభ్యులకు కూడా వారి జాడ తెలియడం లేదని కేరళలో ప్రచారం జరుగుతుంది.
ఇలాంటి సమయంలోనే కేరళకు చెందిన కొందరు సోషల్ మీడియా ద్వారా బిందు మరియు కనకదుర్గు చనిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు.అయ్యప్ప స్వామి వారి దర్శనం తర్వాత వారు తల దాచుకునేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్‌లో చనిపోయారు అని, వారి శవాలు కూడా దొరక లేదని, ఇదంతా కూడా స్వామి వారి కోపం వల్ల జరిగిందని అంటున్నారు.బిందు, కనకదుర్గలు చనిపోయారంటూ వస్తున్న ప్రచారంను కొందరు కొట్టి పారేస్తున్నారు.
వారిపై కోపంతో కొందరు అయప్ప భక్తులు ఇలా ప్రచారం చేస్తూ ఉండవచ్చు.ఇలాంటి ప్రచారం జరగడం మరీ దారుణం.
ఆలయంలో మహిళలు ప్రవేశించినంత మాత్రాన మరీ ఇలాంటి ప్రచారం చేయడం ఏంటీ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆ ఇద్దరు చనిపోయినట్లుగా ప్రచారం చేస్తున్న వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవాలంటూ సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా ప్రచారం చేసే వారు రేపు వారు తారస పడితే నిజంగానే చంపే అవకాశం ఉందని అంటున్నారు.అందుకే కొన్నాళ్ల పాటు వారిద్దరు అండర్ గ్రౌండ్‌లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది.దర్శించుకున్న తర్వాత వారిద్దరిని ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మద్య రక్షణలో ఉంచినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇంకా కూడా కేరళలో పరిస్థితి అదుపులోకి రాని కారణంగా వారిని బయటకు వదలడం లేదు.
పరిస్థితులు శాంతించిన తర్వాత వారిద్దరు రివీల్ అయ్యే అవకాశం ఉంది.