రాజమౌళితో సినిమా చేసి ఇద్దరు హీరోలు కెరీర్ కోల్పోయారా?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ( Rajamouli ) ఒకరు.ఈయన కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

 What Have These Tollywood Heroes Lost Their Film Career Because Of Acting In A M-TeluguStop.com

ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తన కెరియర్ మాత్రం బుల్లితెరపై ప్రారంభించారనే సంగతి మనకు తెలిసిందే.

ఈయన కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ కి డైరెక్టర్ గా పనిచేసేవారు అనంతరం ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో దర్శకుడుగా అవకాశము అందుకున్నటువంటి రాజమౌళి మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు.

మొదటి సినిమా సక్సెస్ కావడంతో ఈయనకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.ఇప్పటివరకు జక్కన్న డైరెక్షన్లో 12 సినిమాలు రాగా ప్రతి ఒక్క సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈయన డైరెక్షన్లో సినిమాలు చేసిన హీరోలు అందరూ కూడా నేడు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా గ్లోబల్ స్టార్స్ అనే ట్యాగ్ తగిలించుకొని మరి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కానీ రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేసిన ఇద్దరు హీరోలు మాత్రం పూర్తిగా తమ కెరియర్ కోల్పోయారని చెప్పాలి.రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేసి కెరియర్ కోల్పోయినటువంటి టాలీవుడ్ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే.

Telugu Career, Nithin, Rajamouli, Sunil, Tollywood, Tollywoodheroes-Movie

రాజమౌళి హీరో నితిన్( Nithin ) తో కలిసి సై అనే సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది.ఇలా రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో సినిమా చేసే హిట్ అందుకున్నటువంటి నితిన్ మాత్రం ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు.ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేస్తూ ఉన్నాయి.

ఇలా రాజమౌళి డైరెక్షన్లో చేసిన నితిన్ కి అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Telugu Career, Nithin, Rajamouli, Sunil, Tollywood, Tollywoodheroes-Movie

ఇక ఈయన డైరెక్షన్లో నటించినటువంటి మరొక హీరో సునీల్ ( Sunil ) .ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో కామెడీ పాత్రలలో నటిస్తూ సక్సెస్ అయ్యారు.అయితే ఈయన రాజమౌళి డైరెక్షన్లో మర్యాద రామన్న అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా తర్వాత ఈయన పలు సినిమాలలో నటించారు అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈయన కెరియర్ కాస్త ఇబ్బందులను ఎదుర్కొన్నారు.హీరోగా అవకాశాలు అందుకోలేక అటు కమెడియన్ గా నటించలేక కొద్దిరోజులు ఇబ్బంది పడినటువంటి సునీల్ ఇప్పుడు మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube