మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహెల్ అరెస్ట్ పై పోలీసుల ప్రకటన

మాజీ ఎమ్మెల్యే షకీల్( Former MLA Shakeel ) కొడుకు రహెల్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్ లోని ప్రజాభవన్ ( Praja Bhavan )ముందు యాక్సిడెంట్ కేసులో రహెల్ ను అరెస్ట్ చేశామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.

 Police Statement On The Arrest Of Former Mla Shakeel's Son Rahel, Rahel, Mla Sha-TeluguStop.com

డిసెంబర్ 24న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రహెల్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.ప్రజాభవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టడమే కాకుండా మరో వ్యక్తిని నిందితుడిగా చూపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.

ఈ కేసులో రహెల్ సహా 15 మందిని అరెస్ట్ చేశామన్నారు.నేరం అంగీకరించడంతో ఉదయం జడ్జి ముందు హాజరుపరిచామన్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించామని తెలిపారు.

అదేవిధంగా హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా విచారణకు హాజరుకావాల్సి ఉందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube