తారక్ కి మాత్రమే ఏంటి ఈ పరిస్థితి ఇది వరకు ఎప్పుడు జరగనిది

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన పవర్ ఫుల్ హీరో జూనియర్ ఎన్టీఆర్.ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.

 What Happened To Jr Ntr Career, Jr Ntr Career , Tollywood , Jr Ntr Movie Upadtes-TeluguStop.com

వాస్తవానికి యావరేజ్ సినిమాను కూడా తన భుజాల మీద వేసుకుని హిట్ గా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్టీఆర్.టెంపర్, జైలవకుశ, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత సినిమాలు తొలుత యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.

ఎన్టీఆర్ నటనా శక్తితో హిట్ సినిమాలుగా నిలిచాయి.

ఎన్టీఆర్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన దగ్గరి నుంచి వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు.సినిమా సినిమాకు మధ్య పెద్దగా గ్యాప్ రాలేదు.2013 నుంచి 2018 వరకు ప్రతి ఏడాది ఆయన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.ఫ్యాన్స్ లో మంచి ఉత్తేజాన్ని నింపుతూనే ఉన్నాయి.అయితే తొలిసారి ఆయన సినిమాలకు బ్రేక్ పడింది.రాజమౌళికి చిక్కిన ఎన్టీఆర్ చాలా వరకు ఆయనకే సమయాన్ని కేటాయించాడు.ఆర్ఆర్ఆర్ సినిమా అనుకున్న సమయాని కంటే ఎక్కువ తీసుకుంది.

మూడు సార్లు సినిమా రిలీజ్ ప్రకటించినా వాయిదా పడింది.కరోనా మూలంగా ఈ సినిమా అనుకున్న సమయానికంటే ఎక్కువ సమయం తీసుకుంది.

Telugu Fil, Carrer, Jr Ntr, Jr Ntr Career, Jr Ntr Upadtes, Rajamouli, Ramcharan,

తాజాగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పెరుగుతున్న నేపథ్యంలో నార్త్ లో నైట్ కర్ఫ్యూలు ఉంటున్నాయి.దీంతో సంక్రాంతికి అయినా ఈ సినిమా విడుదల అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.ఎన్టీఆర్ 2018 త‌ర్వాత వ‌రుస‌గా మూడు క్యాలెండ‌ర్ ఇయ‌ర్లలో సిననిమాలు చేయలేదు.2019, 2020, 2021లో ఆయనకు సంబంధించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.

Telugu Fil, Carrer, Jr Ntr, Jr Ntr Career, Jr Ntr Upadtes, Rajamouli, Ramcharan,

ఎంత కరోనా ఉన్న మిగతా హీరోలు రెండు మూడు సినిమాలు చేశారు.విడుదల అయ్యాయి.మంచి సక్సెస్ అందుకున్నాయి.ఎన్టీఆర్ మాత్రమే ఒక్క సినిమాను కూడా చేయలేకపోయాడు.సంక్రాంతికి అయినా ఈ సినిమా వస్తుందా? అనే  అనుమానం వ్యక్తం చేస్తున్నారు యంగ్ టైగర్ అభిమానులు లేటుగా వచ్చినా లేటెస్టుగా రావాలని కోరుకుంటున్నారు.లేదంటే అభిమానులు నిరాశ చెందాల్సి వస్తుందని చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube