పెళ్లి వేడుకపై గుండెపోటుతో పెళ్ళికొడుకు స్నేహితుడు మృతి (వీడియో)

ప్రస్తుత ప్రజలలో ఎవరికి ఏ సమయాన ఏమి జరుగుతుందో కూడా అర్థమవ్వని పరిస్థితి ఏర్పడింది.అప్పటి వరకు మనతో సరదాగా గడిపిన వారు ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.

 Wedding Turned Into Tragedy Amazon Employee Dies Of Heart Attack In Kurnool Dist-TeluguStop.com

అచ్చం అలాంటి సంఘటననే ఒకటి తాజాగా కర్నూలు జిల్లాలో( Kurnool District ) చోటుచేసుకుంది.పెళ్లి వేడుకలలో( Wedding ) భాగంగా స్నేహితుడికి గిఫ్ట్ అందించి ఓపెన్ చేసే క్రమంలో ఒక స్నేహితుడు అనుకోకుండా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.

కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెనుమాడలో స్నేహితుడి వివాహం కోసం గోనెగండ్ల మండలంలోని బి.అగ్రహారానికి చెందిన వంశీ కుమార్( Vamshi Kumar ) ఊరికి వచ్చాడు.ఈ క్రమంలో స్నేహితులు అందరూ కలిసి వివాహ వేడుకలలో పాల్గొని కొత్తపెళ్లి జంటకు గిఫ్ట్ అందజేశారు.

నూతన వధూవరులు ఇద్దరు ఆ బహుమతిని ఓపెన్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అనుకోకుండా వంశీ కుమార్ కింద పడిపోయాడు.ఇది గమనించిన స్నేహితులు వెంటనే వంశీ కుమార్ నువ్వు పక్కకు తీసుకుని వెళ్లి వాహనంలో డోన్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వంశీ కుమార్ మృతి చెందినట్లు డాక్టర్ తెలియజేశారు.

అప్పటివరకు స్నేహితులతో సరదాగా గడిపి ఉన్నట్టుండి వంశీ కుమార్ ఇలా మృతి చెందడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

సాధారణంగా ప్రస్తుత కాలంలో గుండెపోటుతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి మనకి తెలిసింది.వాస్తవానికి కరోనా మహమ్మారి తరువాత ఇలా గుండెపోటు( Heart Attack ) మరణాలు అధిక సంఖ్యలు నమోదు అవుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలో గుండెపోటు వచ్చిన క్రమంలో ఛాతిలో ఎడమవైపు నొప్పి వస్తుందని డాక్టర్స్ తెలియచేస్తూ ఉన్నారు.అయితే ఎవరికైనా ఛాతిలో ఏదో బరువు మోస్తున్నట్లు అనిపించిన, ఆయాసం, చెమటలు పడుతున్న వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు డాక్టర్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube