వైరల్: బిడ్డ ఎదుగుదల చూస్తూ మురిసిపోతున్న తల్లి ఏనుగుని చూడండి... అమ్మ అమ్మే!

తల్లి ప్రేమను గురించి ఎవరి మాటల్లో వారు చెబుతారు కానీ, ఆ ప్రేమను మనం కొనియాడలేం.వర్ణించడానికి అసలు మనకు పదాలే దొరకు అని చెప్పుకోవాలి.

 Viral Watch Mother Elephant Growling As Baby Grows Amma Amme, Elephant, Love, Vi-TeluguStop.com

ఈ భువిపైన జీవిస్తున్న జీవులన్నిటిలోను తల్లి ప్రేమ ఒకే విధంగా ఉంటుంది.మనుషుల్లోనే కాకుండా జంతువుల్లోనూ అమ్మ ప్రేమ తొణికిసలాడుతూ ఉంటుంది.

ఇక జంతువుల్లో అమ్మ ప్రేమకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం.ఒక్కోసారి మనుషులకంటే జంతువుల్లోనే తల్లి ప్రేమ ఎక్కువగా వుంది అనిపించేలా ఆ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి.

ఈ క్రమంలోనే… తాజాగా అమ్మ ప్రేమకు( Mother’s love ) అద్దం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూశారంటే మనసు ఉప్పొంగక మానదు.వైరల్ అవుతోన్న వీడియో ఒక ఏనుగుకు సంబంధించింది.ఏనుగులు మనుషులకు మల్లే లోతైన భావాలు, భావోద్వేగాలను కలిగి ఉంటాయి.తల్లుల దగ్గర పిల్ల ఏనుగులు( Baby elephants ) చేసే చిలిపి చేష్టలు అన్ని ఇన్ని కావు.ఏనుగు పిల్ల చేష్టలకు సంబంధించిన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి.

ఇది కూడా ఆ రకానికి చెందిన వీడియోనే.

ఇక్కడ వీడియోలో ఓ పిల్ల ఏనుగు తొలిసారి అడుగులు వేయడం గమనించవచ్చు.ఆ తప్పటడుగులను తల్లి ఏనుగు దూరం నుండి చూస్తూ మురిసి పోతోంది.బిడ్డ ఎక్కడ పడిపోతుందో అన్న భయం కూడా ఆ తల్లిముఖంలో చాలా స్పష్టంగా కనబడుతోంది.

ఈ క్రమంలో బిడ్డ ఏనుగుకి సహకరిస్తోంది కూడా.కాగా ఈ వీడియోని చూసి నెటిజన్లు కూడా తెగ ముచ్చట పడిపోతున్నారు.

దాంతో రికార్డు స్థాయిలో ఈ వీడియోని చూస్తున్నారు.కామెంట్లకైతే లెక్కేలేదు.‘తల్లి ప్రేమకు నిదర్శనం ఈ వీడియో’ అని కొందరంటే… తల్లి ప్రేమను మించింది ఏది లేదంటూ కొందరు కామెంట్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube