వైరల్ వీడియో: గుర్రంపై స్వారీ చేస్తూ డెలివరీ లు చేస్తున్న డెలివరీ బాయ్..!

మనసుంటే మార్గం ఉంటుంది అని పెద్దలు చెబుతుంటారు.అది నిజమేనని అమెజాన్ ఈ-కామర్స్ సంస్థకు చెందిన ఒక ఏజెంట్ నిరూపిస్తున్నారు.

గత కొద్ది వారాలుగా జమ్మూ కాశ్మీర్ లో మంచు వర్షం కురుస్తోంది.నిర్విరామంగా కురుస్తున్న ఈ మంచు వర్షాల కారణంగా రహదారులు మంచుతో కప్పబడ్డాయి.

దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.జమ్మూకాశ్మీర్ ప్రాంత ప్రజలు బయటికి వెళ్ళ లేక అవసరమైన సరుకులు తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజా రవాణా వాహనాలు కచ్చితంగా అందుబాటులో ఉండాలి కానీ వాహనాల రాకపోకలకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి.మంచుతో కప్పబడిన రహదారులను రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేస్తుంది కానీ చాలా ప్రాంతాల్లో రహదారులు ఇప్పటికీ ప్రయాణాలకు వీలు పడని విధంగా మంచుతో నిండి పోయాయి.

Advertisement

మంచు వర్షం అందరిని ఆపివేసింది కానీ అమెజాన్ ఏజెంట్ ని ఆపలేకపోయింది.సాధారణంగా అమెజాన్ డెలివరీ బాయ్స్ తమ బైక్స్ పై ట్రావెల్ చేస్తూ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసిన కస్టమర్లకు చేరవేస్తుంటారు.

బైక్ పై కుదరకపోతే వ్యాన్ పై డెలివరీ చేస్తుంటారు.జమ్మూకాశ్మీర్ లో బైకు గానీ వ్యాన్ గానీ నడిచే పరిస్థితులు లేకపోవడంతో ఒక అమెజాన్ ఏజెంట్ ఏదో ఒక విధంగా కస్టమర్లకు ప్రొడక్ట్స్ డెలివరీ చేయాలని అనుకున్నారు.

బాగా ఆలోచించి చివరికి ఒక గుర్రం పై డెలివరీ ఇవ్వాలని నిశ్చయించుకుని.వస్తువులను కస్టమర్లకు చేరవేయడం ప్రారంభించారు.

అయితే ఈ అమెజాన్ ఏజెంటు మంచు వర్షాలను ఫేస్ చేస్తూ బాగా ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు డెలివరీ ఇవ్వటం అక్కడి ప్రాంత ప్రజలను ఆశ్చర్యపరిచింది.కస్టమర్లకు కావాల్సిన వాటిని టైంలో ఇవ్వటం తన బాధ్యతగా భావించిన ఈ అమెజాన్ ఏజెంట్ అంకితభావంతో పని చేస్తుండటం నిజంగా ప్రశంసనీయం.అయితే గుర్రంపై స్వారీ చేస్తూ డెలివరీలు ఇచ్చేస్తున్న అమెజాన్ ఏజెంట్ కి సంబంధించిన వీడియో ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేశాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

దీంతో ఈ వీడియో ని చూసిన నెటిజన్లు అమెజాన్ ఏజెంట్ తో పాటు అమెజాన్ సంస్థ అని కూడా తెగ పొగిడేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు