వైరల్ పిక్: టీమిండియా ప్లేయర్స్ ఏంటి ఇలా అయిపోయారు..?!

ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.ఒక అభిమాని తన టాలెంట్ అంతా ఉపయోగించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మన భారత క్రికెట్ ఆటగాళ్ల ఫోటోలను మార్పింగ్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 Viral Pick: What Happened To Team India Players  Ipl ,viratkohli ,msdhoni ,india-TeluguStop.com

అలాగే ఈ ఫోటోలను క్రికెట్ అభిమానులు సైతం బాగా ఇష్ట పడుతున్నారు.ముఖ్యంగా మన టీమిండియా బెస్ట్ క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్‌ పంత్ ఫొటోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

వీరి ఫోటోలను చూసి అభిమానులు ఫుల్ కుషీగా ఉన్నారు.

అసలు ఇంతకీ అభిమానులకు నవ్వు తెప్పించేలాగా ఆ ఫొటోల్లో ఏముందో చూద్దాం.

ఈ కాలంలో వయసు పైబడుతున్న కొద్ది ఎవరికి వారికి ఫిట్నెస్ కోల్పోయి శరీరాన్ని భారీగా పెంచేస్తున్నారు.పొట్టలు కూడా బాగా పెంచేస్తున్నారు.ఈ క్రమంలో మన టీమిండియా క్రికెటర్లు వాళ్ళ ఫిట్‌నెస్‌ కోల్పోయి లావుగా మారితే చూడడానికి ఎలా ఉంటారో అనే ఆలోచనతో ఒక అభిమాని ఫన్నీగా క్రికెటర్ల ఫొటోలను ఫోటో షాప్ ఫిల్టర్ ను ఉపయోగించి క్రికెటర్ల ముఖాలను, వాళ్ళ బాడీని మార్చేశాడు.క్రికెటర్లు 30 ఏళ్లు దాటిన తర్వాత ఎలా ఉంటారో అని ఈ ఫోటోలలో మీరు చూడవచ్చు.

పొట్టలు ముందుకు తోసుకుని వచ్చి అన్‌ఫిట్‌ గా మారిపోయి, ముఖ కవళికలు మారిపోయి అచ్చం అంకుల్స్‌ లాగా కనిపిస్తున్నారు.అయితే ఫోటో మార్ఫింగ్ మాత్రం ముఖాలలో ఎటువంటి మార్పు లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చాయి.ఈ ఫొటోలను చూసి అభిమానులు ఎవరికీ నచ్చిన రీతిలో వారు కామెంట్స్ పెడుతున్నారు.ఫిట్‌ గా కనిపించే మన క్రికెటర్లు ఏంటి ఇలా అన్ ఫిట్ అయిపోయారని కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు అయితే భవిష్యత్తులో మన క్రికెటర్లు ఇలానే మారిపోతారు అంటున్నారు.ఏది ఎలా ఉన్నాగాని వీరి ఫోటోలు మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం మన టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉండి 5 టెస్ట్‌ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube