రొటీన్ డైలాగులు రిపీట్ చేస్తున్న హ‌రీశ్‌రావు.. ఆ మాట‌ల‌పై ప్ర‌తిప‌క్షాలే ప్ర‌శ్నించ‌ట్లేదా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో మొద‌టి నుంచి టీఆర్ ఎష్ ఒకే విధ‌మైన వ్యూహాలు ప‌న్నుతోంది.

మ‌రీ ముఖ్యంగా టీఆర్ ఎస్‌కు వ్యూహాలు అందించ‌డంలో దిట్ట అయిన హ‌రీశ్‌రావు మాత్రం మొద‌ట్లో బాగానే వ్యూహాలు అమ‌లు చేసే వారు.

అయితే ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం రొటీన్ డైలాగుల‌తో రొటీన్ వ్యూహాల‌తో బోర్ కొట్టిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.ఇక ఉద్యమ స‌మ‌యంలో విప‌క్షాల‌కు పూర్తి భిన్నంగా మాట్లాడి ప్ర‌జ‌ల‌ను ఆకర్షించిన హ‌రీశ్‌రావు లాంటి నేత‌లు కూడా ఇప్పుడు రొటీన్ గానే మాట్లాడుతున్నారు.

ఇక ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ హ‌వా పెరిగిపోవ‌డంతో ఆ పార్టీకి చెందిన నేతలు బాగానే ప్ర‌శ్నిస్తున్నారు.అయితే వారిని ఎదుర్కోవ‌డంలో మాత్రం టీఆర్ ఎస్ నేత‌ల‌కు కొత్త‌గా వ్యూహాలు, విమ‌ర్శ‌లు దొర‌క‌ట్లేద‌న్న‌ట్టు మాట్లాడుతున్న‌రు.

ప్ర‌తిప‌క్షాలు ఏవైనా ప్ర‌శ్న‌లు లేదంటే డిమాండ్లు ముందు పెడితే లేదంటే నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు ఇవ్వాలంటూ అడిగితే మాత్రం కేంద్రం నుంచి తెలంగాణ‌కు ఎంత తీసుకువ‌చ్చారని కామ‌న్ గా ప్ర‌శ్నిస్తున్నారు.ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పెద్ద‌ ఎత్తున నిధులు కావాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.

Advertisement

లేదంటే రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణ బీజేపీ నేత‌లు తీసుకువ‌చ్చారంటూ అడుతున్నారు.అయితే ఇదే స‌మ‌యంలో విప‌క్ష ఎమ్మెల్యేలు ఒక డిమాండ్‌ను గ‌న‌క తెర‌మ‌ద‌కు తెస్తే టీఆర్ ఎస్‌కు చెక్ పెట్టిన‌ట్టు అవుతుంది.అదేంటంటే విప‌క్ష ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్ని నిధులు ఇస్తున్నారు అలాగే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాలుక ఎన్ని నిధులు ఇస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్లు గ‌న‌క చేస్తే మాత్రం అప్పుడు టీఆర్ ఎస్ ఇలాంటి రొటీన్ వ్యూహాల‌కు పులిస్టాప్ పెట్టేస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు.

మ‌రి ఇప్ప‌టికైనా విప‌క్షాలు ఆ మేర‌కు డిమాండ్ చేస్తాయో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు